Shruti Haasan pic When She was 14 శ్రుతి హాసన్ గత కొన్ని రోజులుగా వార్తల్లో ట్రెండ్ అవుతూనే ఉంది. ఆమె తన ఫ్యాన్స్‌తో చేసే చిట్ చాట్‌లు, శంతనుతో చేసే రొమాన్స్, తన ట్రైనర్‌తో కలిసి చేసే వర్కౌట్లకు సంబంధించిన విజువల్స్ వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా శ్రుతి హాసన్ తన గ్యాంగ్‌తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. అయితే అది ఇప్పటి ఫోటో కాదు. దాదాపు ఇరవై, ఇరవై ఐదేళ్ల క్రితం నాటి ఫోటో అనిపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రుతి హాసన్‌కు అప్పుడు పద్నాలుగేళ్లు ఉంటాయట. ఆ టైంలో ఇలా తన ఫ్రెండ్స్‌తో కలిసి ఫోటోకు పోజులిచ్చాడని, అప్పుడు ఎంతో ఘోరంగా ఉన్నానంటూ తన గురించి తాను చెప్పుకొచ్చింది. ఇక ఈ ఫోటోలో శ్రుతి హాసన్‌ను గుర్తు పట్టడం కూడా కష్టమే. అయితే ముక్కుకి సర్జరీ చేసుకున్న తరువాత ఇంత అందంగా అయిందని అందరికీ తెలిసిందే. అంతకు ముందు శ్రుతి హాసన్ ఇలా ఉండేదా? అని అంతా షాక్ అవుతున్నారు.


ఈ సర్జరీ మీద కూడా ఎన్నో సార్లు శ్రుతి హాసన్ ఎన్నో సార్లు స్పందించింది. తన ముక్కు తన ఇష్టం అని, అయినా ఇబ్బంది ఉండి తాను సర్జరీ చేసుకుంటే మీకేంటి ప్రాబ్లం అని కూడా ట్రోలర్లను నిలదీసింది శ్రుతి హాసన్. ముక్కుకి సర్జరీ చేసుకున్నానని కూడా బహిరంగంగానే ప్రకటించింది శ్రుతి హాసన్.


[[{"fid":"265559","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఇక ఇప్పుడు శ్రుతి హాసన్ నాటి ఫోటో నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. ఇందులో శ్రుతి హాసన్ ఎవరో గుర్తు పట్టడం కూడా కష్టంగానే ఉంది అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పటి శ్రుతి హాసన్‌కు అప్పటి శ్రుతి హాసన్‌కు ఎంతో మార్పు ఉందని నెటిజన్లు ఆశ్చర్యపోతోన్నారు.


శ్రుతి హాసన్‌ ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టేసింది. సంక్రాంతి మొత్తం తనదే అన్నట్టుగా మారింది. చిరు వాల్తేరు వీరయ్య, బాలయ్య వీర సింహా రెడ్డి సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన శ్రుతి హాసన్‌కు రెండు హిట్లు పడ్డాయి. ఇక ఇదే ఏడాది సలార్ సినిమాతో మరో బ్లాక్ బాస్టర్ హిట్‌ని కూడా తన ఖాతాలో వేసుకునేలా ఉంది.


Also Read:  Oscars 2023 Live Updates: ఆస్కార్ విజేతల జాబితా, ఎవరెవరికి ఏ అవార్డులు


Also Read: Oscars 2023: తెలుగోడి సత్తాచాటిన 'నాటు నాటు'. Naatu Naatu పాటను వరించిన ఆస్కార్ అవార్డు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook