Bigg Boss Shubhashree Car Accident: 'మనోభావాలు దెబ్బతిన్నయంటూ' బిగ్‌ బాస్‌ సీజన్‌ సెవన్‌ లో హల్‌చల్ చేసిన బ్యూటీ శుభశ్రీ. ఆదివారం ఈమె ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కు గురైంది. సినిమా షూటింగ్‌లో  భాగంగా ఆమె నాగర్జున సాగర్ వైపుగా ప్రయాణిస్తున్నప్పుడు బైక్‌ నడుపుతున్న ఇద్దరు యువకులు ఈమె కారును ఢీకొట్టారు. దీంతో శుభ శ్రీ ప్రయాణిస్తున్న కారు పూర్తిగా డ్యామేజ్‌ అయింది. శుభశ్రీ ఫ్యాన్స్‌ ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఆ కారు శుభ శ్రీ షూటింగ్‌కు సంబంధించిన కారు శుభ శ్రీ ఎటువంటి గాయాలు అవ్వలేదు ఆమె క్షేమంగా ఉన్నారు. బైక్‌ పై వెళ్తున్న ఆ ఇద్దరు యువకులు మద్యం సేవించడంతో యాక్సిడెంట్‌ జరిగినట్లు సమాచారం. వారికి స్వల్ప గాయాలు అయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదీ చదవండి: పండుగ ముందు జియో బిగ్ అప్‌గ్రేడ్‌.. రూ.1,029 రీఛార్జీ ప్లాన్‌తో ఇక అమెజాన్ ప్రైమ్‌ లైట్‌ ఉచితం..  


ఈ రోజు ఆదివారం మధ్యాహ్నం సమయంలో నాగర్జున సాగర్‌ బస్టాండ్‌ వద్ద ఈ యాక్సిడెంట్‌ జరిగింది. అయితే, శుభ శ్రీ కారు ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ కార్‌ యాక్సిడెంట్‌ ఫోటోలను చూసి శుభ శ్రీ కి ఏమైందో అని ఆమె ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. సమాచారం మేరకు శుభ శ్రీ కి ఎలాంటి గాయాలు అవ్వలేదు. శుభ శ్రీ షూటింగ్‌ కోసం వెళ్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. 


బిగ్‌ బాస్‌ సీజన్‌ 7లో మనోభావాలు దెబ్బతిన్నాయంటూ తెలుగు బిగ్‌ బాస్‌ ప్రేక్షకుల మనస్సు దోచుకున్నారు. బిగ్‌ బాస్‌లో ఆమె అందం క్యూట్‌నెస్‌కు ఫ్యాన్స్‌ ఉన్నారు. ఆమె మాటాలతో తెలుగు ప్రేక్షకుల మనస్సు దోచుకున్నారు. ఇదిలా ఉండగా శుభ శ్రీ బిగ్‌ బాస్‌ తర్వాత కూడా కొన్ని టీవీ షోలలో పాల్గొన్నారు. అంతేకాదు శుభ శ్రీ యూట్యూబ్‌ ఛానల్‌ ఉంది. సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటారు. శుభ శ్రీ పూర్తిపేరు శభు శ్రీ రాయగురు.


ఇదీ చదవండి:  పీఎం కిసాన్‌ రూ.2000 పడలేదా? అయితే వెంటనే ఈ చిన్న పనిచేయండి...  


 




 


ప్రస్తుతం హిరోయిన్‌గా కూడా నటిస్తున్న ఈ ఒడియా బామకు ఈ ఘటనతో బిగ్‌ బాస్‌ బ్యూటీకి తృటిలో పెద్ద ప్రమాదం కూడా తప్పనట్లయింది. శుభశ్రీకి సుబ్బు అనే నిక్‌ నేమ్‌ కూడా ఉంది. అంతేకాదు ఈ అందమైన బామ మంచి యాక్టర్‌ మాత్రమే కాదు డ్యాన్సర్, లాయర్, మోడల్‌ కూడా. ముఖ్యంగా ఈమె 3000 వరకు లైవ్‌ షోలకు హోస్ట్‌ చేసిన రికార్డు కూడా ఉంది. శుభశ్రీ అందానికి వీఎల్‌సీసీ ఫెమినా మిస్‌ ఇండియా ఒడిశా 2020 కూడా దక్కించుకుంది. ఇక సినిమాల్లో అరంగేట్రం చేసిన శుభ 2022 రుద్రవీణ సినిమాల్లో నటించారు. 'ఆ' అనే మరో తెలుగు సినిమాతోపాటు ఉత్రాన్‌ (2019) తమిళ సినిమాలో కూడా నటించారు. ప్రస్తుతం శుభ శ్రీ 'భీం భూమికి జై' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వెళ్తుండగా యాక్సిడెంట్‌ ఘటన చోటు చేసుకుంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.