Jio Bumper Plan Upgrade: జియో అద్భుతమైన ఆఫర్ తన కస్టమర్ల కోసం ముందుకు తీసుకువచ్చింది. దిగ్గజ జియో రూ.1,029 ప్లాన్‌లో సవరణ చేసింది. దీంతో కస్టమర్లకు రీఛార్జీ ప్లాన్ ధరలో ఏ మార్పు చేయకుండా అమెజామ్ ప్రైమ్ లైట్ కూడా ఉచితంగా అందిస్తుంది. అంతకు ముందు కేవలం అమెజాన్ మొబైల్ ఎడిషన్ మాత్రమే అందించింది.
రిలయన్స్ జియో వినియోగదారులు కచ్చితంగా పండుగ చేసుకునే ఆఫర్ కంపెనీ తీసుకువచ్చింది. రీఛార్జీ ప్లాన్‌కు అదనంగా ఓటీటీ కూడా అందిస్తోంది. దీంతో మిలియన్ల మంది కస్టమర్లకు ఓటీటీ రీఛార్జీ ప్లాన్ ధరలోనే పొందవచ్చు. మీ రీఛార్జీ ప్లాన్ గడువు ముగిస్తే మళ్లీ రీఛార్జ్ ప్లాన్ చేసుకోవాల్సి వస్తే ఈ ప్లాన్ ఎంపిక చేసుకోండి బెనిఫిట్స్ కూడా పొందండి.
రిలయన్స్ జియో రూ.1,029 ప్లాన్ అప్డేట్ చేసి అమెజాన్ ప్రైమ్ లైట్‌ను అదనంగా చేర్చింది. ఈ రీఛార్జీ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్, 168 జీబీ డేటా కూడా పొందనున్నారు. ప్రతిరోజూ 2 జీబీ డేటా పొందుతారు. దీంతో హై స్పీడ్ డేటా పొందుతారు. అదనంగా 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు ప్రతిరోజూ పొందుతారు.
ఈ 5జీ స్పీడ్ జియో ప్లాన్ 5జీ కనెక్టివిటీ ఉన్న ఏరియాల్లో అద్భుతంగా డేటా ఎంజాయ్ చేయవచ్చు. డైలీ డేటా లిమిట్ పూర్తిగా అయిపోయిన తర్వాత నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్ పొందుతారు.
జియో రూ.1,029 అప్‌గ్రేడ్ చేయడం వల్ల ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లో అదనంగా అమెజాన్ ప్రైమ్ లైట్ కూడా అందిస్తోంది. దీంతో వినియోగదారులు 84 రోజులపాటు గతంలో అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ఎంజాయ్ చేసేవారు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లైట్ ఓటీటీ బెనిఫిట్స్ పొందుతారు.
అమెజాన్ ప్రైమ్ VS అమెజాన్ ప్రైమ్ లైట్.. అమెజాన్ ప్రైమ్ లైట్ వల్ల రెండు డివైజ్‌లు కనెక్ట్ (టీవీ, మొబైల్) వీడియోలు చూడవచ్చు. ఇందులో హెచ్‌డీ క్వాలిటీ (720p), ఒక్కరోజులో అమెజాన్ ఉత్పత్తులను డెలివరీ పొందే సౌలభ్యం కూడా పొందవచ్చు.ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ కేవలం ఒక్క మొబైల్‌లో మాత్రమే వీడియోలు వీక్షించాల్సి ఉంటుంది. ఇది కేవలం కొన్ని దేశాల్లోనే అందుబాటులో ఉంది.