న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన శ్యామ్ సింగ రాయ్ మూవీ హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ ఫిలింనగర్ అప్‌డేట్స్ ప్రకారం.. శ్యామ్ సింగ రాయ్ మూవీ హిందీ శాటిలైట్ రైట్స్ర్ రూ. 10 కోట్లు పెట్టి B4U అనే ఛానెల్ కొనుగోలు చేసినట్టు సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాని హిందీ చిత్రాలకు హిందీ డిజిటల్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా యూట్యూబ్‌తో పాటు పలు హింది సినిమా ఛానెళ్లలో నాని సినిమాలకు మంచి క్రేజ్ కనబడుతుంటుంది. అందుకే నాని సినిమాకు ఆ టీవీ ఛానెల్ వాళ్లు అంత భారీ మొత్తం పెట్టి మరీ శ్యామ్ సింగ రాయ్ హిందీ రైట్స్ దక్కించుకున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. 


అంతేకాకుండా ఇటీవలే విడుదలైన శ్యామ్ సింగ రాయ్ మూవీ టీజర్‌కి సైతం భారీ స్పందన కనిపించింది. ఈ టీజర్ శ్యామ్ సింగ రాయ్ మూవీపై అంచనాలు పెంచింది. హింది డబ్బింగ్ రైట్స్‌కి భారీ డిమాండ్ ఏర్పడటానికి ఇది కూడా ఓ కారణమైందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.



Also read : ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి మరో అప్డేట్.. ‘జనని’ పాట రిలీజ్ ఎప్పుడంటే?


దక్షిణాదిన తెలుగు, తమిళ, కన్నడ, మళయాళం భాషలతో పాటు ఉత్తరాదిన హిందీలో కూడా విడుదలవుతున్న సినిమా ఇది. క్రిస్మస్ సెలవుల్లో ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేసేలా డిసెంబర్ 24న శ్యామ్ సింగ రాయ్ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది.   


రాహుల్ సంక్రిత్యన్ డైరెక్ట్ చేస్తున్న శ్యామ్ సింగ రాయ్ మూవీలో సాయి పల్లవి, క్రితి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.


Also read : స్పృహ కోల్పోయిన లేడీ డ్రైవర్.. ప్రాణాలకు తెగించి ఆ కారుకు తన కారును అడ్డుపెట్టి.. వైరల్ వీడియో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook