శ్యామ్‌ సింగరాయ్‌ పక్కా హిట్ అట, ఈ క్రిస్మస్‌ మనదే అంటోన్న నాని

Shyam Singha Roy Film to release on December 24: టీజర్‌ (Teaser‌) విడుదల తర్వాత నాని మాట్లాడారు. టీజర్‌ విడుదల సందర్భంగా మీ అందర్నీ చూడటం.. మీ అరుపులు వినడంతో నా కడుపు నిండిపోయిందన్నారు. ఇందుకోసమే తాము కష్టపడి పని చేసేదన్నారు. ఈ సారి కరెక్ట్‌ సినిమాతో వస్తున్నా, క్రిస్మస్‌ (Christmas‌) మనదే అంటూ ఫ్యాన్స్‌ను ఉత్తేజపరిచారు నాని.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2021, 01:35 PM IST
  • క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 24న శ్యామ్‌ సింగరాయ్‌ రిలీజ్‌
  • ఈ సారి కరెక్ట్‌ సినిమాతో వస్తున్నా.. క్రిస్మస్‌ మనదే
  • ఫస్ట్‌డే మార్నింగ్‌ షో చూసేందుకు ఎదురుచూస్తున్నా
  • ఫ్యాన్స్‌ను ఉద్దేశించి నాని వెల్లడి
శ్యామ్‌ సింగరాయ్‌ పక్కా హిట్ అట, ఈ క్రిస్మస్‌ మనదే అంటోన్న నాని

Nani, Sai Pallavi's Shyam Singha Roy Film to release on December 24 in theatres, Nani says movie will get superhit:నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కిన మూవీ శ్యామ్‌ సింగరాయ్‌. రాహుల్‌ సంకృత్యాన్‌ ఈ మూవీకి డైరెక్టర్. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 24న ఈ మూవీ రిలీజ్ కానుంది. తాజాగా శ్యామ్‌ సింగరాయ్‌ టీజర్‌ను కూడా మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. 

టీజర్‌ (Teaser‌) విడుదల తర్వాత నాని మాట్లాడారు. టీజర్‌ విడుదల సందర్భంగా మీ అందర్నీ చూడటం.. మీ అరుపులు వినడంతో నా కడుపు నిండిపోయిందన్నారు. ఇందుకోసమే తాము కష్టపడి పని చేసేదన్నారు. ఈ సారి కరెక్ట్‌ సినిమాతో వస్తున్నా, క్రిస్మస్‌ (Christmas‌) మనదే అంటూ ఫ్యాన్స్‌ను ఉత్తేజపరిచారు నాని.

శ్యామ్‌ సింగరాయ్‌ (Shyam Singha Roy) లాంటి మంచి సినిమాలో భాగమైనందుకు తనకెంతో ఆనందంగా ఉందన్నారు. అంతేకాదు.. మీ అందరితో కలిసి ఈ సినిమా ఫస్ట్‌డే మార్నింగ్‌ షో (Morning‌ Show) చూసేందుకు ఎదురుచూస్తున్నా అని నాని ఫ్యాన్స్‌ను ఉద్దేశించి అన్నారు. ఇక మీ ఎనర్జీని డిసెంబర్‌ 24న (December 24) అలాగే దాచుకోండి అంటూ అభిమానులను కోరారు.

Also Read : క్యారీ బ్యాగ్ కొనుగోలు చేయమని ఒత్తిడి.. పిజ్జా కంపెనీకి రూ.11 వేలు జరిమానా

ప్రతి మూవీ కూడా మనం ఏదైనా కొత్త దశ ప్రారంభించడానికే చేస్తామని చెప్పుకొచ్చారు. అయితే కొన్నిసార్లు బాగా కుదురుతాయి... కొన్నిసార్లు కుదరకపోవచ్చు అని అన్నారు. కానీ తాముపడే కష్టంలో.. ప్రయత్నంలో ఏమాత్రం లోపం ఉండదని నాని అన్నారు. అయితే ఈసారి ఎందుకో అన్నీ చక్కగా కుదిరినట్లు అనిపిస్తోందని నాని చెప్పుకొచ్చారు. 

ఈ సినిమాతో మేము తప్పకుండా సక్సెస్‌ సొంతం చేసుకుంటామని నమ్ముతున్నానని నాని అన్నారు. ఇది ఒక భిన్నమైన లవ్‌ స్టోరీ (Love Story) అని పేర్కొన్నారు. శ్యామ్‌ సింగరాయ్‌ మూవీ ఈ స్టోరీ బెంగాలీ నేపథ్యంలో ఉంటుందని అన్నారు. అలాగే సాయి పల్లవితో (Sai Pallavi) కలిసి మరోసారి స్క్రీన్‌ పంచుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని నాని చెప్పుకొచ్చారు. ఎంసీఏతో ఇప్పటికే తామిద్దరం బ్లాక్‌బస్టర్‌ అందుకున్నామని తెలిపారు.

Also Read : సంచలన నిజాలు వెల్లడించిన నటి షాలు చౌరాసియా..పొదల్లోకి తోసి లైంగిక దాడికి పాల్పడ్డాడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News