Siddharth Aditi rao Hydari in Sharwanand Engagement శర్వానంద్ పెళ్లి మీద గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఆమె ఒక ఎన్నారై అని, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని, ప్రస్తుతం ఇక్కడే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ హైద్రాబాద్‌లో ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు శర్వానంద్ ఎంగేజ్మెంట్ న్యూస్‌ అధికారికంగా వచ్చేసింది. తనకు పెళ్లి కుదిరిందని, నిశ్చితార్థం చేసుకున్నానని శర్వానంద్ ప్రకటించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తనకు కాబోయే భార్య రక్షిత రెడ్డిని అందరికీ పరిచయం చేశాడు. ఇక ఈ ఈవెంట్‌లో టాలీవుడ్ సినీ ప్రముఖులంతా కూడా సందడి చేశారు. చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చాడు. రామ్ చరణ్‌ తన సతీమణి ఉపాసనతో వచ్చాడు. ఇక వీరందరిలోనూ సిద్దార్థ్ అదితీ రావు హైదరీ జోడి అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలే ఈ జంట ఇప్పుడు డేటింగ్ చేస్తోందనే రూమర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.


ఈ క్రమంలో ఎక్కడా జంటగా కనిపించినా మీడియా కెమెరా కళ్లు వారినే ఫోకస్ చేస్తున్నాయి. ఇక బాలీవుడ్ మీడియా మీద కూడా ఆ మధ్య సిద్దార్థ్ కాస్త ఫైర్ అయ్యాడు. ఇప్పుడిలా శర్వానంద్ ఎంగేజ్మెంట్ వేడుకలో జంటగా మెరిశారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టుగా, డేటింగ్ చేస్తున్నట్టుగా చెప్పకనే చెప్పేసినట్టు తెలుస్తోంది.


అజయ్ భూపతి తీసిన మహా సముద్రం సినిమాతో శర్వానంద్, సిద్దార్థ్ మంచి స్నేహితులుగా మారారు. ఇక అదే సినిమా షూటింగ్ సమయంలో సిద్దార్థ్, అదితీ రావ్ మధ్య ప్రేమ చిగురించినట్టుగా కనిపిస్తోంది. అప్పటి నుంచి ఈ ఇద్దరూ ప్రైవేట్‌గా కలుస్తున్నారని సమాచారం. ఇక సిద్దార్థ్ ప్రేమ వ్యవహారాలు ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గానే అవుతుంటాయన్న సంగతి తెలిసిందే.


Also Read:  Hunt Telugu Movie Review : హంట్ రివ్యూ.. సుధీర్ బాబు డేరింగ్ స్టెప్ 


Also Read: Sharwanand Engagement: ఘనంగా హీరో శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌.. వైరల్ పిక్స్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి