Siddhartha gave a serious warning to photographers: గ్లామర్ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు ఆ తర్వాత విడాకులు చాలా సర్వసాధారణమైపోతున్నాయి. తమ ప్రేమను బయటపెట్టడానికి చాలా కాలం తీసుకుంటున్న హీరో హీరోయిన్లు విడిపోతున్న విషయాన్ని మాత్రం వెంటనే చెప్పేస్తూ ఆయా బంధాల నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఒక కొత్త బంధం ఏర్పడే అవకాశాలు ఉన్నాయనే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ బంధం మరి ఎవరిదో కాదు సిద్ధార్థ- అదితి రావు హైదరిలది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకప్పుడు తెలుగు తమిళ సినిమాలతో కుర్ర కారు మనసు దోచిన సిద్ధార్థ ఆ తర్వాత సరైన హిట్ సినిమాలు లేకపోవడంతో ఒక రకంగా కనుమరుగ అయ్యే పరిస్థితి ఏర్పడింది. చివరిగా ఆయన మహాసముద్రం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే సినిమా ఆడకపోతేనేమి ఆ సినిమా షూటింగ్ సమయంలో అదితీ రావ్ హైదరితో ఆయన ప్రేమలో పడ్డాడు అనే ప్రచారం మొదలైంది.


దానికి కారణం ముంబైలో ఇద్దరు కలిసి కనిపించడమే. సిద్దార్థ్,  అదితీ రావ్ హైదరి కలిసి బయటకు వస్తున్న సమయంలో ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీయడానికి ప్రయత్నించడంతో సిద్ధార్థ సీరియస్ అయినట్లు సమాచారం. తాను ఇక్కడి వాడిని కాదని ఇక్కడి వారిని మీరు ఫోటోలు తీయాలని మరోసారి ఇలా జరిగితే ఇంత నెమ్మదిగా అయితే చెప్పను అంటూ వారికి వార్నింగ్ ఇచ్చాడట. ఇలా కలిసి తిరిగితే తప్పులేదు కానీ ఫోటోలు తీస్తే తప్పు వచ్చిందా అంటూ ఫోటో గ్రాఫర్ల మీద కొంతమంది సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.


ఇక సిద్ధార్థ వ్యవహార తీరు మొదటి నుంచి ఇలాగే ఉంటుందని ఇలా బెదిరిస్తూ కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సిద్ధార్థ గతంలో మేఘన అని అమ్మాయిని వివాహం చేసుకొని ఆమెకు విడాకులు ఇచ్చారు. తర్వాత సమంతతో కొన్నాళ్లు డేటింగ్ చేసినట్లు ప్రచారం ఉంది. మరోపక్క అది తీరావ్ హైదరి కూడా తన జీవితంలో ఇప్పటికే హిందీ నటుడు ఒకరిని వివాహం చేసుకొని ఆయనకు విడాకులు ఇచ్చారు. ఇప్పుడు విడాకులు తీసుకుని సింగిల్ గా ఉంటున్న ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు అంటూ ప్రచారం జరుగుతున్న నేపద్యంలో అది ఎంతవరకు నిజమవుతుందో కాలమే నిర్ణయించాలి మరి. 


Read Also: Samantha Ruthprabhu: అంతమంది పెళ్లి కాని హీరోలుండగా స్టార్ హీరోయిన్ భరపై కన్నేసి!


Read Also: TV Actress Death: పరిశ్రమలో తీవ్ర విషాదం.. క్యాన్సర్ తో ప్రముఖ నటి దుర్మరణం!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook