Siddha's Saga Teaser: మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టేసింది చిత్రబృందం. ఈ సినిమాలోని రామ్ చరణ్ పాత్ర సిద్ధకు సంబంధించిన టీజర్ ను నవంబరు 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం.  



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇందులో దేవాలయాల బాగు కోసం పాటుపడే పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కనిపించనున్నారు. అలానే నక్సలైట్​ పాత్రలోనూ అభిమానుల్ని అలరించనున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్, పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ, సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి. ‘లాహే లాహే’ లిరికల్ సాంగ్ యూట్యూబ్ లో 100 మిలియన్ల వ్యూస్ దక్కించుకోగా.. ఇటీవలే విడుదలైన ‘నీలాంబరి’ సాంగ్ ప్రేక్షకులను అలరిస్తోంది.


‘ఆచార్య’ సినిమాలో చిరుకు జోడీగా కాజల్​, రామ్​ చరణ్​కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్​టైన్​మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


Also Read: చిరంజీవి, Nagababu, పవన్ కల్యాణ్‌లలో Niharika కు ఎవరంటే ఎక్కువ ఇష్టమో తెలుసా ?


Also Read: Pooja Kannan: హీరోయిన్ గా సాయిపల్లవి సిస్టర్..ఫస్ట్ లుక్ విడుదల..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook