Tillu Square: అయోమయంలో సిద్దు జొన్నలగడ్డ... ఫిబ్రవరిలో కూడా టిల్లు స్క్వేర్ లేనట్టేనా
Tillu Square Release Date: డీజే టిల్లు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సిద్దు జొన్నలగడ..ప్రస్తుతం చాలా రోజుల నుంచి ఆ సినిమా సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మొదటినుంచి ఏదో ఒక కష్టం ఎదుర్కొంటూ వస్తున్న ఈ సినిమాకి ..ఇప్పుడు రిలీజ్ డేట్ నిర్ణయించుకోవడం కూడా అత్యంత కష్టం అయ్యేటట్టే ఉంది..
Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ సినిమాకు మొదటి నుంచి ఏదో ఒక కష్టం వస్తువునే ఉంది. 2022 లో విడుదలై సూపర్ హిట్ సాధించిన డిజె టిల్లు సినిమాకు ఈ చిత్రం సీక్వెల్. ఈ చిత్రాన్ని షూటింగ్ పూర్తి చేసి ఎప్పుడో 2023 సమ్మర్ టైమ్ లో విడుదల చెయ్యాలి అనుకున్నారు ఈ సినిమా యూనిట్. కానీ ఎప్పటినుంచో పోస్ట్ పోన్ అవుతూ వస్తూ ఇంకా కూడా సెట్ మీదే వుంది. మొదట్లో హీరోయిన్ లు మారారు. ఎలానో ఒకలా అనుపమ ఫిక్స్ అయింది. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్… చివరికి డైరెక్టర్ కూడా మారారు.
కానీ సినిమా మాత్రం అనుకున్నట్లుగా ముందుకు సాగడం లేదు. ఆరంభంలో ఈ సినిమా మీద మాంచి క్రేజ్ వుంది. అయితే పోయేకొద్ది ఆ అంచనాలు అన్నీ తగ్గుతున్నాయి. ఈ సినిమా నుంచి ఒక్కో పాట వదులుతున్నా, ఆశించిన క్రేజ్ రావడం లేదు. దానికి తోడు చిత్రం టీమ్ లో జరుగుతున్న మార్పులు చూసి ప్రేక్షకులకు ఈ సినిమా ఫలితం పై అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. అయితే సిద్దు జొన్నలగొడ్డ చెక్కడం అనే కళలో ఆరితేరడం వల్లనే ఈ సమస్యలన్నీ ఎదురవుతున్నాయని దానివల్ల చివరికి ఆయన అయోమయంలో పడేటట్టు ఉందని సమాచారం.
ఈ నేపథ్యంలో సినిమాని ఫిబ్రవరి 9 విడుదల చేస్తారు అనుకుంటే…ఈ సినిమా డేట్ ను త్యాగం చేసి సంక్రాంతి బరిలో ఉన్న రవితేజ సినిమా ఈగిల్ కు ఇచ్చారు. నిజానికి ఈగిల్ ఇవ్వడానికి ముందే ఈ సినిమాను వాయిదా వేసుకునే ఆలోచనలో వున్నారన్నది ఇన్ సైడ్ టాక్.
ఇక ఫిబ్రవరిలో ఈ సినిమాకి సంబంధించిన పనులన్నీ పూర్తయిన ఈ చిత్రం సమ్మర్ వరకు విడుదల అయ్యే సూచనలు మాత్రం కనిపివ్వడం లేదు. ఎందుకంటే మార్చి నెలలో టిల్లి స్క్వేర్ నిర్మాణ సంస్థ నిర్మించిన విష్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విడుదల వుంది. అందువల్ల ఏప్రిల్ లో విడుదల చేసుకోవాల్సి వుంటుంది. కానీ ఈసారి ఎన్నికలు మార్చి, ఏప్రిల్ మధ్యలోనే వుంటాయని టాక్ వుంది. దాని వల్ల పరిక్షల తేదీలు కూడా అటు ఇటు అయ్యే అవకాశం వుంది. కాబట్టి ఎన్నికలు, పరీక్షలు ముందు పెట్టుకుని ఆ టైంలో సినిమా రిలీజ్ చేస్తే సూపర్ హిట్ టాక్ వచ్చిన కలెక్షన్లు మాత్రం పెద్దగా రావు.
కాబట్టి మన టిల్లు గాడి విడుదలకు మంచి టైమ్ సమ్మర్. అంటే మే నెల వరకు ఆగాల్సిందే. బహుశా ఆ ఉద్దేశంతోనే డేట్ ను ఈగిల్ కు త్యాగం చేసి వుండొచ్చు కూడా. మొత్తానికి ఆటు పోయి ఇటు పోయి చివరిగా ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చూడాలి.
Also Read: Rat found in Online Food: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్.. చచ్చిన ఎలుకను తిన్న యువకుడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter