Singer Chinmayi: ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై ముందుండి పోరాడుతోంది సింగర్ చిన్నయి. తనూశ్రీ దత్తా తర్వాత సినీ ఇండస్ట్రీలో ఈ దురాగతంపై అలుపెరగని పోరాటం చేస్తోంది. తమిళ లెజండరీ రైటర్ వైరముత్తు తనను లైంగికంగా వేధించాడంటూ చెప్పి సంచలనం రేపింది. తనకు జరిగిన అవమానాలను బయట పెట్టినందుకు తనకు అవకాశాలు రాకుండా చేసారని వాపోయింది సింగర్ చిన్మయి. ఇలా డేరింగ్ అండ్ డాషింగ్‌గా తనకు జరిగిన అన్యాయలపై గళమెత్తిన ఈమె.. ఈ మధ్యకాలంలో లేని పోని వ్యాఖ్యలతో  ఇబ్బందుల పాలవుతూనే ఉంది సింగర్ చిన్మయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా సీనియర్ నటి అన్నపూర్ణ్మమ్మ చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ ఈమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా చిన్మయి చేసిన పోస్ట్‌లో మన దేశాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయని హెచ్‌సీయూ విద్యార్ధి కుమార్ సాగర్ పోలీసులకు కంప్లైంట్ చేసారు. బాధ్యతల గల పౌరురాలిగా దేశాన్ని కించ పరచడం భావ్యం కాదంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో గచ్చిబౌలి పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.   


ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ.. 'ఆడవాళ్లకు అర్ధరాత్రి స్వాతంత్య్రం దేనికి.. రాత్రి 12 గంటల తర్వాత వాళ్లకు బయట ఏమి పని ఉంటుంది. అంతేకాదు మాములు అమ్మాయిలు కూడా బయట ఎక్స్‌పోజింగ్ చేస్తూ నానా రచ్చ చేస్తున్నారు. పురుషులను రెచ్చగొట్టేలా చేస్తున్నారు. ఎదుటివాళ్లది తప్పు అనడం కాదు.. ముందు మనం ఎలా ఉంటున్నామనే దానిపై ఆడవాళ్లు శ్రద్ద పెట్టాలన్నారు. ఈ వీడియోను చిన్మయి షేర్ చేస్తూ .. నేను అన్నపూర్ణమ్మ గారికి వీరాభిమానిని. కానీ మనం అభిమానించే వాళ్లు ఇలా మాట్లాడితే మాత్రం ఆవేదన కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఇలాంటి దేశంలో ఆడపిల్లగా పుట్టడం నా కర్మ.. ఇదొక .. కంట్రీ అంటూ చిన్మయి గళమెత్తింది. ఈ సందర్బంగా దేశాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంపైనే నెటిజన్స్ మండిపడుతున్నారు.


Also Read: రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకానికి గైడ్ లైన్స్.. అర్హులు మాత్రం వీళ్లే..


Also Read: PPF Investment: రోజుకు 400 రూపాయలు పెట్టుబడితో 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter