Chinmayi Sripada Twin Babies : సింగర్ చిన్మయి శ్రీపాద గురించి సౌత్‌ ఆడియెన్స్‌కు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆమె గాత్రం, ఆమె పాడిన పాటలు, డబ్బింగ్, వాయిస్ ఇలా అన్నింటితోనూ ఆమె క్రేజ్ తెచ్చుకుంది. అయితే వీటన్నంటి కంటే.. మీటూ ఉద్యమం, క్యాస్టింగ్ కౌచ్ మీద పోరాటమే ఆమెను ఎక్కువగా పాపులర్ చేసేసింది. కోలీవుడ్‌లో ఈమెను అందరికీ శత్రువుని చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింగర్ చిన్మయి అంటే ఫైర్ బ్రాండ్ అన్న ట్యాగ్ తెచ్చుకుంది. కోలీవుడ్ స్టార్ రైటర్ వైరముత్తుకు ఎదురుగా నిల్చుంది. తనపై చిన్నతనంలో అసభ్యకరంగా ప్రవర్తించాడని వైరముత్తు మీద ఆరోపణలు చేసింది. వైరముత్తుఎంతో మంది ఆడవాళ్ల జీవితాలతో ఆడుకున్నాడంటూ ఆరోపించింది. సింగర్ కార్తీక్ నిజస్వరూపాన్ని కూడా చిన్మయి బయట పెట్టేసింది.


కార్తీక్ తన వద్దకు వచ్చిన అమ్మాయిలను ఎలా వాడుకుంటాడో బయటి ప్రపంచానికి చెప్పింది. అలా సింగర్ చిన్మయి అందరికీ శత్రువైంది. కానీ ప్రజలకు మాత్రం దగ్గరైంది. ఇప్పుడు ఆడవాళ్లందరికీ చిన్మయి ఐకాన్‌లా మారింది. ఆడవాళ్లు తమ కష్టాలను చిన్మయితో పంచుకుంటారు. బాధను తీర్చుకుంటారు. అలా చిన్మయి సోషల్ మీడియాలో ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటుంది.


 



ఇలా చిన్మయి మీద పాజిటివ్ ఇమేజ్ మాత్రమే కాకుండా.. నెగెటివ్ కూడా నడుస్తుంటుంది. ఆమె మీద ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతుంది. పిచ్చి పిచ్చి ఫోటోలు, మాటలతో ఆమె మీద దాడి చేస్తుంటారు. అయినా కూడా చిన్మయి మాత్రం వెనక్కి తగ్గదు. ట్రోలింగ్ మీద అంతే స్థాయిలో రియాక్ట్ అవుతుంటుంది. అయితే చిన్మయి జూలై 22న కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.


ఒక బాబు, ఒక పాప పుట్టడంతో చిన్మయి, రాహుల్ ఇద్దరూ సంబరపడిపోయారు. ద్రిప్తా, శర్వాస్అనే పేర్లు పెట్టేశారు. అయితే ఇప్పుడు చిన్మయి తన పిల్లలకు పాలు ఇస్తూ ఆనందంలో మునిగిపోతోంది. మాతృత్వాన్ని పూర్తిగా ఆస్వాధిస్తోన్నట్టుగా కనిపిస్తోంది. ప్రపంచంలో ఇంత కంటే గొప్ప ఫీలింగ్ ఉండదేమో అన్నట్టుగా చిన్మయి చెప్పుకొచ్చింది.


Also Read : Bigg Boss 6 Telugu 7th Week Nomination : మాటలతో దెబ్బ మీద దెబ్బ కొడుతున్న గీతూ.. హర్టైన బాలాదిత్య.. నామినేషన్ లిస్ట్ ఇదే


Also Read :Kantara Telugu Movie Collections : కాంతారా రెండో రోజు కలెక్షన్లు.. కుమ్మి అవతలపారేసిందిగా


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook