Bigg Boss 6 Telugu 7th Week Nomination : మాటలతో దెబ్బ మీద దెబ్బ కొడుతున్న గీతూ.. హర్టైన బాలాదిత్య.. నామినేషన్ లిస్ట్ ఇదే

Bigg Boss 6 Telugu 7th Week Nomination బిగ్ బాస్ ఇంట్లో ఏడో వారం నామినేషన్ లిస్ట్ అదిరిపోయింది. ఏడో వారంలో నామినేషన్ ప్రక్రియలో బాలాదిత్య, గీతూ మధ్య ఎమోషనల్ సంభాషణ జరిగినట్టు కనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 17, 2022, 04:31 PM IST
  • బిగ్ బాస్ ఇంట్లో ఏడో వారం నామినేషన్స్
  • శ్రీహాన్ ఇనయల మధ్య మళ్లీ గొడవ
  • మాటలతో బాలాదిత్యను హర్ట్ చేసిన గీతూ
Bigg Boss 6 Telugu 7th Week Nomination : మాటలతో దెబ్బ మీద దెబ్బ కొడుతున్న గీతూ.. హర్టైన బాలాదిత్య.. నామినేషన్ లిస్ట్ ఇదే

Bigg Boss 6 Telugu 7th Week Nomination List : బిగ్ బాస్ ఇంట్లో ఏడోవారం ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఆరువారాలు సక్సెస్ ఫుల్ కాగా.. ఆరుగురు ఇంటి సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప వంటి వారు ఎలిమినేట్ అయ్యారు. ఇక ఇప్పుడు ఏడో వారానికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియలో మాటలు కోటలు దాడుతున్నాయి. కొందరు వింత చేష్టలు చేస్తూ.. ఎదుటివాళ్లను ఎగతాళి చేస్తున్నారు.

అయితే ఈ ఏడో వారం నామినేషన్ ప్రక్రియలో మాత్రం రేవంత్ బలైనట్టు కనిపిస్తోంది. ఆరోవారంలో ఇంటి కెప్టెన్ అయిన రేవంత్.. పదే పదే పడుకోవడం, అతని వల్ల పది శాతం బ్యాటరీ తగ్గిపోవడంతో అందరూ అదే కారణంతో నామినేట్ చేసినట్టు కనిపిస్తోంది. దీంతో రేవంత్ బాగానే హర్ట్ అయినట్టున్నాడు. నామినేట్ చేయడానికి మీకు మరో కారణం లేదని అర్థమైందంటూ రేవంత్ అందరి మీద కౌంటర్లు వేశాడు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News