Singer Mangli Clarity on Car attack: టాలీవుడ్ సింగర్ మంగ్లీ మీద బళ్లారిలో దాడి జరిగినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని మంగ్లీ ఖండించింది, ఈ మేరకు ఆమె తన సోషల్ మీడియా వేదికగా ఒక క్లారిటీ కూడా ఇచ్చింది. తన మీద దాడి జరిగినట్లు వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని తాను పూర్తిగా ఈ వార్తలను ఖండిస్తున్నానని పేర్కొంది. తాను కొన్ని సోషల్ మీడియా గ్రూప్ లో తన మీద నిన్న బళ్ళారిలో  జరిగిన ఈవెంట్ లో దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయని కానీ అది నిజం కాదని ఆమె పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కనుక చూస్తే ఆ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయిందనే విషయం అందరికీ అర్థమవుతుందని పేర్కొంది. తన కెరీర్ లోనే ఒక బెస్ట్ ఈవెంట్ గా కూడా నిలిచిందని ఈ సందర్భంగా మంగ్లీ పేర్కొంది. అలాగే కన్నడ ప్రజలు తన మీద కురిపించిన ప్రేమ తనకు సపోర్ట్ గా నిలిచిన విధానం మాటల్లో వర్ణించలేనిదని ఆమె పేర్కొన్నారు.


అలాగే అక్కడి అధికారులు ఆ ఈవెంట్ నిర్వాహకులు తన మీద చూపించిన కేర్ అలాగే తనను వారు చూసుకున్న విధానం, కూడా తన మాటల్లో వర్ణించలేనని ఆమె చెప్పుకొచ్చారు. అయితే అలాంటి వారి మీద ఇప్పుడు జరుగుతున్న దుష్ప్రచారం చూసి దీనిని ఖండించాలని ఉద్దేశంతో తాను ఈ క్లారిటీ ఇస్తున్నానని ఈ సందర్భంగా మంగ్లీ తాను రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో పేర్కొంది.


అయితే తాజాగా జరిగిన బళ్ళారి ఈవెంట్ లో మంగ్లీ కన్నడలో మాట్లాడలేదని కన్నడ భాషాభిమానులు ఆమె, కారు మీద దాడి చేసినట్లు సోషల్ మీడియాలో మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇదే విషయాన్ని ఖండిస్తూ మంగ్లీ ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం కూడా మంగ్లీ అనూహ్యంగా వార్తల్లోకి వచ్చింది. ఎస్వీబీసీ ఛానల్ కు ఆమెను సలహాదారుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆమె ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చినట్లయింది. 
Also Read: NTR Missed Kaththi Remake: ఎన్టీఆర్ చేయాల్సిన సినిమాతో హిట్ కొట్టిన చిరంజీవి!


Also Read: Singer Mangli Attack: మంగ్లీ కారుపై రాళ్లదాడి.. అసలు ఏమైందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook