Karthika Deepam: జ్యోత్స్నను పెళ్లి చేసుకోమన్న దీప.. నువ్వే దగ్గరుండి మా పెళ్లి గ్రాండ్‌గా చేయాలంటున్న కార్తీక్‌... ఇదేం ట్విస్ట్‌?

Karthika Deepam Today December 17th Episode: అదృష్టం చేసుకున్నందుకే వీరి కుటుంబంలో ఆణిముత్యం పుట్టింది అని జ్యోత్స్నను అంటాడు. దీప మాట అంటేనే నాకు బంగారం. తనే నా సర్వస్వం. బంధాలు వదులుకుంది నేను కాదు మీరు. మీలా నాకు వదులడం చేతకాదు అందుకే ఈ చేయి జీవితాంతం పట్టుకుంటా అని దీప చేయి పట్టుకుంటాడు కార్తీక్‌.

Written by - Renuka Godugu | Last Updated : Dec 17, 2024, 10:25 AM IST
Karthika Deepam: జ్యోత్స్నను పెళ్లి చేసుకోమన్న దీప.. నువ్వే దగ్గరుండి మా పెళ్లి గ్రాండ్‌గా చేయాలంటున్న కార్తీక్‌... ఇదేం ట్విస్ట్‌?

Karthika Deepam Today December 17th Episode:  జ్యోత్స్న ఆవేశంతో ఊగిపోతుంది.  నా ఒపికను నా సహనాన్ని మీ అహంకారంతో తగిలేశారు. ఇదిగో నా రాజీనామా గుడ్‌బై అని దీపను తీసుకువెళ్తాడు. తాత, బావ వెళ్లిపోతున్నాడు ఆపు అంటుంది జ్యోత్స్న. ఎక్కడికి వెళ్లినా మళ్లీ తిరిగి రావాల్సింది నా కాళ్ల దగ్గరికి అని చెప్పి వెళ్లిపోతాడు శివన్నారాయణ. ముందు ఈ విషయం గ్రానీకి చెప్పాలి అని నిర్ణయించుకుంటుంది జ్యోత్స్న.  మరోవైపు గ్రానీ దాసు.. దాసు అని పిలుస్తూ ఉంటుంది. ఏంటమ్మా అంటాడు దాసు.. ముందు ఈ స్వీట్ తీసుకో అంటాడు. కార్తీక్‌ గాడిని కంపెనీ నుంచి బయటకు గెంటేశాడు. నా మనవరాలి కింద పనిచేయలేక రాజీనామా ఇచ్చి బయటకు వెళ్లిపోయాడు ఎలా  ఉంది కౌంటర్‌ అంటుంది కాశీ భార్య. తలనొప్పి వదిలిపోయింది మావయ్యగారు జాబ్‌ రిజైన్‌ చేసి మంచి పనైంది. బావగారు ఓన్‌ బిజినెస్‌ స్టార్ట్‌ చేస్తే మీరు అందుకోలేనంత ఎత్తు ఎదుగుతాడు అంటాడు కాశీ.

పైకి ఏడవలేక పొగరుగా మాట్లాడుతున్నారా? అంటుంది. అమ్మ దీనంతటికీ కారణం జ్యోత్స్న కదా అంటాడు. అవును అంటుంది గ్రానీ, ఎంతసేపు ఆ అనాథ డబ్బా ఎందుకు అంటుంది. బాబాయ్‌ అని పిలిస్తే కూతురు అయిపోతుందా? అది నష్ట జాతకురాలు అంటుంది గ్రానీ. ఇక ఆపుతావా? దీపను ఏమి అనకూడదు అమ్మ అంటాడు.. సరేలా మీరంతా  కలిసి దీప భజన చేసుకోండి అంటుంది గ్రానీ, దాంతో ఉంటే కార్తీక్‌ గాడు కూడా నష్టజాతకుడిగా మారతాడు అది అస్సలు బాగుపడకూడదు ఇదే నా శాపం అని వెళ్లిపోతుంది గ్రానీ.

నువ్వు ఇలా ఏడుస్తావు ఇంటికి వెళ్దాం అంటాడు కార్తీక్‌. నువ్వు క్యారీర్ తెచ్చావు కదా నీముందే పక్కన పెట్టి హోటల్ నుంచి తెప్పించుకుని తింటే నువ్వు ఫీల్‌ అవ్వవా? నన్ను ఆ పోస్ట్ నుంచి పీకేసి మొదటి అవమానం చేశారు. ఎందుకు నీకోసం, మా అమ్మ కోసం. ఏ పోస్ట్ ఇవ్వలేక క్వాలిటీ సూపర్‌వైజర్‌ పోస్ట్ ఇచ్చి సంతకం పనిచేయదు అని రెండోసారి అవమానం చేశాడు. అభిమానం చంపుకోలేక బయటక వచ్చేశా.నేను ది గ్రేట్‌ శివన్నారాయణ కుటుంబం నుంచి బయటకు వచ్చేశా ఓకేనా అంటాడు. అయినా వారిస్తుంది దీప. అనాథల మిగిలిన మాకు ఓ నీడ ఇచ్చారు. అటు తండ్రికి దూరం అయ్యారు ఇటు తాతయ్యకు దూరం అయ్యారు అంటుంది.

నేను అనాథను కాదు నాకు ఓ తల్లి ఉంది, పెళ్లాం ఉంది. చెల్లి, అభిమానించే బావమరిది ఉంది ఇది చాలదా? అంటాడు. మీ అమ్మగారికి బాధగా ఉండదా? నేను కారణమయ్యాను అంటుంది దీప. జ్యోత్స్నను మీరు పెళ్లి చేసుకుంటే ఈ వ్యాపార సామ్రాజ్యానికి మీరు అధిపతి అయ్యేవారు అని ఏడుస్తుంది దీప. మీరు జ్యోత్స్నను పెళ్లి చేసుకుంటే తాతయ్య హోదాలో మీరు ఉండేవారు. అన్ని నాకోసం వదులుకొని నడిరోడ్డపై నిలబడ్డారు అని ఏడుస్తుంది. అయితే, ఇప్పుడు నీ బాధ తగ్గాలంటే నేనేం చేయాలి చెప్పు అంటాడు కార్తీక్.. వెంటనే దీప మీరు జ్యోత్స్నను పెళ్లి చేసుకోవాలి అంటుంది.

ఇదీ చదవండి: ధాన్యలక్ష్మి పేరు చెబితేనే వణికిపోతున్న కావ్య.. అయ్యయ్యో గుండెనొప్పితో కుప్పకూలిన అమ్మమ్మ..   

ఒక్కసారి షాక్‌కు గురవుతాడు.. పదా.. అంటాడు కార్తీకబాబు ఎక్కడికి అంటుంది దీప. పెళ్లి సంబంధం మాట్లాడటానికి అంటాడు. నేను  సరదాగా అనట్లేదు దీప సీరియస్‌గా చెబుతున్నా. ఈ సమస్యకు పరిష్కారం జ్యోత్స్నను పెళ్లి చేసుకోవడం అంటాడు. ఆ పెద్దాయన్ను ఒప్పించి కనివినీ ఎరుగుని రీతిలో మా పెళ్లి జరిపించు, భర్తకు మరదలితో పెళ్లి చేసి కొత్త జీవితం అందించినందుకు మహిళ మండలి వాళ్లు నిన్ను సత్కరిస్తారు. నువ్వు మాత్రం పాత బ్యాగ్‌ పట్టుకుని 312 బస్‌ కోసం ఎదురు చూస్తు ఉంటావ్‌. నీకు ఇదే కదా కావాలి అంటాడు. 

అర్హత అనేది మరదలిగా పుడితే రాదు. నేనెప్పుడైనా సరదాగా ఓ గంట మాట్లాడటం చూశావా? అంటాడు. ఏదో ఒకరోజు మనం ఏంటి అని ప్రశ్నించుకునే రోజు రాకుడదు. నా మనస్సుకు నచ్చిన మనిషినే నేను పెళ్లి చేసుకున్న.నువ్వు మాట్లాడినా, కనిపించినా, కార్లో కూర్చున్నా నాకు హాయిగా ఉంటుంది. అది సరిపోదా జీవితానికి ఏది పోగొట్టుకున్నానో నాకు తెలియదు కానీ, నిన్ను మాత్రం సంపాదించుకున్నా అంటాడు. ఎప్పుడు మీరు చెప్పేదే వినాలా? నేను చెప్పేది వినరా అంటుంది. ఎవరి కారణంగానో మనం విడిపోకూడదు దీప.

ఇదీ చదవండి: దీపను మళ్లీ బస్టాండ్‌పాలు చేసిన శివన్నారాయణ.. కోపంతో ఊగిపోతున్న కార్తీక్‌బాబు.. అసలు విషయం దాసు చెప్పేశాడా?

అమ్మకు నిజం తెలిస్తే బాధపడుతుంది నువ్వు అన్నప్పుడు తెలియలేదు కానీ అంటాడు కార్తీక్. ఇప్పుడైనా మీ మావయ్య గారి ఇంటికి వెళ్లి చెప్పండి. మా అత్తకు నేను ఏంటో తెలుసు దీప ఇంటికి పదా నేను చెబుతా అంటాడు. రేయ్‌.. కార్తీక్‌ ఇంటికి వచ్చావు ఏంట్రా అంటుంది. ఓహో ఇద్దరు కలిశారా? అంటుంది. ఈరోజు ఆఫీస్‌లో ఫుల్‌ బిజీ అన్నావు కదరా? దీప ఆఫీస్‌క్‌ వచ్చేది కాదు కదరా అంటుంది కార్తీక్‌ అమ్మ. మళ్లీఆఫీస్‌కు వెళ్తావా ఏంటి? అంటుంది. ఎక్కడకు వెళ్లాల్సిన అవసరం లేదు అమ్మ అని వెళ్లిపోతాడు. అదేంటి అలా అంటాడు ఏమైంది దీప అంటుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News