Singer Sid Sriram To Play Lead Role in Mani Ratnam's New Movie: సిద్ శ్రీరామ్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. లాంటి ఇండస్ట్రీలో మనోడికి మంచి క్రేజ్ ఉంది. ఎందుకంటే.. ఇటీవలి కాలంలో ఆయన పాడిన ప్రతి పాట ఓ సెన్షేషన్. నిజం చెప్పాలంటే ఇటీవలి కాలంలో సిద్ శ్రీరామ్ (Sid Sriram) పాట లేని సినిమా లేదు. సిద్ శ్రీరామ్ పాడే మెలోడీ పాటలకు ఎంతో మంది మంత్ర ముగ్దులు అవుతున్నారు. ఇక యూట్యూబ్‌లో ఆయన పాడే పాటలకు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. సినిమా విడుదల కాకముందే సిద్ శ్రీరామ్ తన పాట ద్వారా మూవీపై హైప్ క్రియేట్ చేస్తాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిన్న,పెద్ద సినిమా అనే తేడా లేకుండా సిద్ శ్రీరామ్ పాటలు పాడుతున్నాడు. ఇంకేం ఇంకేం కావాలె (గీతా గోవిందం), ఒకే ఒక లోకం నువ్వే (శశి), మగువా మగువా (వకీల్ సాబ్), లెహరాయి (మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్), సో సో గా (మంచిరోజులొచ్చాయి), ఏమో ఏమో (రాహు), నీలినీలి ఆకాశం (30 రోజుల్లో ప్రేమించడం ఎలా), ఉండిపోరాదే (ఉషారు), అరరే మనసా (ఫలక్ నమా దాస్), శ్రీవల్లి (పుష్ప) లాంటో హిట్ పాటలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడిన సిద్ శ్రీరామ్‌కు లేడీ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది.


Also Read: Covid-19 Updates: షాకింగ్ న్యూస్.. 300 మంది పోలీసులకు కరోనా పాజిటివ్


సింగర్‌ (Singer)గా మంచి పేరు తెచ్చుకున్న సిద్ శ్రీరామ్.. ఇప్పుడు మరో కొత్త అవతారంలో కనిపించబోతున్నాడట. స్టార్ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో వచ్చిన 'కడలి' సినిమాతో సిద్ శ్రీరామ్ గాయకుడిగా ఎంట్రీ ఇవ్వగా.. ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే హీరో (Sid Sriram Hero)గా మారనున్నట్లుగా ఫిలింనగర్ టాక్. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్చలు పూర్తయ్యాని, స్క్రీప్ట్ నచ్చడంతో హీరోగా నటించేందుకు సిద్ శ్రీరామ్ ఒప్పుకున్నాడని కోలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరానున్నాయి. ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహిస్తారా? లేదా నిర్మాతగా ఉంటారా? అన్నది తెలియదు. 


Also Read: IPL 2022: భారత్‌లోనే ఐపీఎల్‌ను నిర్వహిస్తాం.. కరోనా పరిస్థితి చేయిదాటితే మాత్రం..: బీసీసీఐ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook