IPL 2022: భారత్‌లోనే ఐపీఎల్‌ను నిర్వహిస్తాం.. కరోనా పరిస్థితి చేయిదాటితే మాత్రం..: బీసీసీఐ

ఐపీఎల్‌ 2022ను స్వదేశంలో కాకుండా విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో ఓ బీసీసీఐ అధికారి కీలక ప్రకటన చేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 10, 2022, 10:07 AM IST
  • ఐపీఎల్‌పై బీసీసీఐ కీలక ప్రకటన
  • భారత్‌లోనే ఐపీఎల్‌ను నిర్వహిస్తాం
  • కరోనా పరిస్థితి చేయిదాటితే మాత్రం
IPL 2022: భారత్‌లోనే ఐపీఎల్‌ను నిర్వహిస్తాం.. కరోనా పరిస్థితి చేయిదాటితే మాత్రం..: బీసీసీఐ

BCCI exploring all host options with worsening Covid-19 situation: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2021 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కసరత్తులు ప్రారంభించింది. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్తియ పూర్తికాగా.. మెగా వేలం కోసం బీసీసీఐ ప్రణళికలు సిద్ధం చేస్తోంది. 2022 సీజన్‌లో రెండు కొత్త ఫ్రాంచైజీలు వస్తున్న నేపథ్యంలో బీసీసీఐ మెగా వేలం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. లక్నో (Lucknow) మరియు అహ్మదాబాద్‌ (Ahmedabad)లతో పాటు ఇప్పటికే ఉన్న 8 ఫ్రాంచైజీలు వేలంలో పాల్గొననున్నాయి. దాంతో ఐపీఎల్ (IPL 2022) 15వ సీజన్ మెగా వేలం కోసం ఫ్రాంచైజీలతో పాటుగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఐపీఎల్ 2022 మెగా వేలం (IPL 2022 Mega Auction)ను బీసీసీఐ ఫిబ్రవరిలో నిర్వహిచనుంది. ఫిబ్రవరి 12 మరియు 13 తేదీలలో బెంగళూరు (Bengaluru)లో వేలం జరుగుతుందని ఇదివరకే బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఐపీఎల్  2022 మెగా వేలం 2018 మాదిరిగానే రెండు రోజుల పాటు జరగనుందని కూడా తెలిపాయి. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దాంతో కర్ణాటక రాష్ట్రం కఠిన ఆంక్షలు విధిస్తోంది. దాంతో మెగా వేలం వేదిక బెంగళూరు నుంచి మారవచ్చని సమాచారం తెలుస్తోంది. హైదరాబాద్ (Hyderabad) నగరంను మరో ఆప్షన్‌గా బీసీసీఐ చూస్తోందట. 

Also Read: Bandla Ganesh Corona: నిర్మాత బండ్ల గణేష్ కు మూడోసారి కరోనా పాజిటివ్

మరోవైపు ఐపీఎల్ 2022కు సంబంధించి ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. ఈ ఏడాది ఐపీఎల్‌ను స్వదేశంలో కాకుండా విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో ఓ బీసీసీఐ అధికారి (BCCI Source) కీలక ప్రకటన చేసింది. 'ఐపీఎల్ 2022కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు చేయలేదు. ఐపీఎల్ షెడ్యూల్ లేదా వేదికలు ఇంకా ఖరారు కాలేదు.  భారత్‌లోనే ఐపీఎల్‌ను నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తున్నాం. కోవిడ్-19 పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాం. విదేశీ ఎంపికలను (Host Options) కూడా అన్వేషిస్తున్నాము. ఒకవేళ ఇక్కడ కరోనా పరిస్థితి చేయిదాటితే విదేశీ గడ్డపై టోర్నీ జరుగుతుంది. ప్రస్తుతానికి మా ప్రాధాన్యత వేలం నిర్వహించడమే. ఆ తర్వాతే అన్ని ప్రకటిస్తాం' అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. 

కొవిడ్ (Covid-19) భయాల కారణంగా​ ఐపీఎల్​ 2021 మ్యాచ్​లను కఠిన బయో బబుల్​ రూల్స్​ మధ్య భారత్‌లోని ఆరు నగరాల్లో ముందుగా నిర్వహించింది. లీగ్​ దశలో కొన్ని మ్యాచ్​లు అనుకున్నట్లుగానే జరిగాయి. అయితే బయో బబుల్​లో ఉన్నప్పటికీ.. కొంతమంది ప్లేయర్స్​, స్టాఫ్​ కరోనా బారిన పడ్డారు. వెంటనే అప్రమత్తమైన బీసీసీఐ తదుపరి మ్యాచ్​లను వాయిదా వేసింది. అన్ని సర్దుకున్న తర్వాత సెప్టెంబర్​-అక్టోబర్​ మధ్య తిరిగి యూఏఈలో మిగతా మ్యాచ్​లను నిర్వహించింది. అంతకుముందు కూడా ఐపీఎల్ 2020 యూఏఈ (UAE)లోనే జరిగిన విషయం తెలిసిందే. 

Also Read: IND vs SA 3rd Test: అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. విరాట్ కోహ్లీ వచ్చేస్తున్నాడు! హైదరాబాద్ ఆటగాడికి షాక్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News