Love Today Promo బిగ్ బాస్ ఇంట్లో సిరి, షన్నులు చేసిన రచ్చకు రెండు తెలుగు రాష్ట్రాలు నోరెళ్లబెట్టాయి. ఈ ఇద్దరికీ బయట లవర్స్ ఉన్నా కూడా బిగ్ బాస్ ఇంట్లో హద్దులు దాటేశారు. షన్ను కోసం దీప్తి, సిరి కోసం శ్రీహాన్ బయట ఉన్నారు. అయినా కూడా సిరి, షన్నులు మాత్రం హగ్గులు, ముద్దులంటూ నానా రచ్చ చేశారు. సిరి తల్లి అయితే షన్నుతో దూరంగా ఉండు.. అన్నలాంటి వాడు అని చెప్పి.. హింట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయినా కూడా సిరి బుద్ది మారలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షన్నుని వదిలి పెట్టలేదు. అలానే కంటిన్యూ చేసింది. సిరి ముద్దులు, హగ్గులతో షన్ను లైఫ్ పూర్తిగా మారిపోయింది. బయటకు వచ్చిన తరువాత దీప్తి సునయన బ్రేకప్ చెప్పేసింది. కొన్ని రోజులు సిరి, శ్రీహాన్‌లు కూడా మాట్లాడుకున్నట్టుగా కనిపించలేదు. చివరకు రవి ఇంట్లో సిరి, శ్రీహాన్‌లు కలిసినట్టుగా ఓ ఫోటో బయటకు వచ్చింది.


అలా బిగ్ బాస్ షోతో రెండు జంటల మధ్య కాస్త గ్యాప్ వచ్చింది. ఇప్పుడు సిరి, శ్రీహాన్‌లు బాగానే కలిసి ఉన్నారు. శ్రీహాన్ ఆరో సీజన్‌లో ఉండగా.. బయట నుంచి సిరి బాగానే సపోర్ట్ చేసింది. శ్రీహాన్ కోసం బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిన సిరి.. లిప్ లాక్‌తో అందరికీ షాక్ ఇచ్చింది. ఒంటి మీద టాటూ కూడా వేయించుకుంది.


 



ఇలా సిరి, శ్రీహాన్‌ల లవ్ స్టోరీ ఇంకా కంటిన్యూ అవుతోంది. దీప్తి షన్నుది మాత్రం బ్రేకప్ అయింది. ఇప్పుడు వాలెంటైన్స్ డే స్పెషల్‌గా చేస్తోన్న లవ్ టుడే షోలో సిరి తన తప్పులను ఒప్పుకుంది. ఇలా స్టేజ్ మీద ఎవరూ కూడా తప్పులను ఒప్పుకోరు.. తెలిసో తెలియకో తప్పులు చేశా అని సిరి కన్నీరు కార్చేసింది. దీంతో శ్రీహాన్, రవిలు దగ్గరకు తీసుకుని ఓదార్చారు.


మొత్తానికి బిగ్ బాస్ ఇంట్లో చేసిన తప్పులకు సిరి పశ్చాతాప్పడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇక సిరి, శ్రీహాన్‌ల పెళ్లి మీద కూడా ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఇదే ప్రశ్న ఓ నెటిజన్ అడిగితే.. త్వరలోనే పెళ్లి చేసుకుంటామని సమాధానం ఇచ్చింది సిరి.


Also Read:  Ashu Reddy : జనాలకు నా బ్యాక్ అంటేనే ఇష్టం!.. అషూ రెడ్డి ముదురు కామెంట్లు


Also Read: Kiara Advani Wedding Pics : కియారా అద్వాణీ సిద్దార్థ్ మల్హోత్రల పెళ్లి.. రామ్ చరణ్ కామెంట్ ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook