Sirivennela Last Song: జన హృదయాల్లోంచి పాటల్ని రాసిన మాంత్రికుడు, ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల ఇంకా బతికే ఉన్నారు. మనిషి మరణించినా ఆయన పాట బతికే ఉంది. మరో రెండ్రోజుల్లో విడుదలకు సిద్ఘంగా ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయన పాటలు ఆలోచింపజేస్తాయి. ఆయన పాటలు మనస్సును హత్తుకుంటాయి. ఆయన పాటలు ఉర్రూతలూగిస్తాయి. ఆయన పాటలు ప్రేమనిస్తాయి. ఆయన పాటలు కదిలిస్తాయి. అందుకే జనహృదయ గేయ రచయిత, అక్షరాల్లో వెన్నెల కురిపించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికంగా లేకపోయినా..పాట మాత్రం బతికే ఉంది. సినీ పరిశ్రమ ఉన్నంతవరకూ ఆయన పాట బతికే ఉంటుందనేది ఏ మాత్రం అతిశయోక్తి కాదు. సిరివెన్నెల చివరి పాట ఫిబ్రవరి 2న విడుదలకు సిద్ధమౌతోంది. ఆ పాట విశేషాలేంటో చూద్దాం.


యాధృచ్ఛికమో..ఏంటో తెలియదు గానీ సిరివెన్నెల రాసిన చివరి పాట జనన, మరణాల గురించే. తన మరణం గురించి ముందే ఊహించి రాశారా అన్నట్టుగా ఉంటుంది. పక్కా కమర్షియల్ సినిమా కోసం సిరివెన్నెల రాసిన చివరి పాట ఇది. జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు..జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు అంటూ సాగే ఈ పాట ఫిబ్రవరి 2వ తేదీన విడుదల కానుంది. గోపీచంద్ హీరోగా, మారుతి తెరకెక్కించిన ఈ సినిమా అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు ఈ చిత్రం కోసం జనన, మరణాల గురించి రాసిన పాటే..సిరివెన్నెల ఆఖరి పాటగా మిగిలింది. అదిప్పుడు జనం ముందుకు రానుంది. మరణం గురించి ముందే తెలిసినట్టుగా కొన్ని పదాలు ఇందులో రాసుకున్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఈ చిత్రంలో గోపిచంద్ సరసన రాశీ ఖన్నా నటిస్తోంది. ఇంకా సత్యరాజ్ , రావు రమేశ్, సప్తగిరి తదితరులున్నారు. ఈ సినిమాకు సంగీతాన్ని జేక్స్ బిజోయ్ అందిస్తుండగా..కరమ్ చావ్లా కెమేరామెన్‌గా ఉన్నాడు. సినిమా ఎలా ఉన్నా సిరివెన్నెల ఆఖఱి పాట కావడంతో ఎక్కువ అంచనాలున్నాయి. 


Also read: Ketika Sharma Pics: ఎద, నడుమందాలు చూపిస్తూ.. కుర్రాళ్ల మతిపోగోడుతోన్న కేతిక శర్మ!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook