Ari Movie Updates: సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన పేపర్ బాయ్ మూవీ తెలుగు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. ఓ పేపర్ బాయ్ గొప్పింటి అమ్మాయి ప్రేమలో పడడం.. ఆ యువకుడిని అమ్మాయి కుటుంబ సభ్యులు సెంటిమెంటల్‌గా బ్లాక్‌మెయిల్ చేయడం.. ప్రేమను వదులుకుని దూరంగా వెళ్లిన తన ప్రియుడిని కలిసేందుకు యువతి పడిన ఆరాటం తెరపై చక్కగా వర్కౌట్ అయ్యాయి. అన్ని హంగులను మేళవించి.. ఓ చక్కటి ప్రేమకథను ఆడియన్స్‌కు అందించాడు డైరెక్టర్ జయ శంకర్. ఈ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ తరువాత మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌ తీసుకుని అరి అనే మూవీ తెరకెక్కించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Chandrababu Naidu: బీజేపీతో పొత్తుకు చంద్రబాబు సై.. ఢిల్లీలో అగ్రనేతలతో భేటీ  


ఈ సినిమాలో అనసూయ, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్ తదితర కీలక పాత్రలు పోషించారు. కమెడియన్ హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్‌లు కూడా ఇతర పాత్రల్లో నటించారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఎప్పుడు వార్తలు వైరల్ అవుతునే ఉన్నాయి. రీమేక్‌కు సంబంధించి వార్తలు తరచూ తెరపైకి వస్తున్నాయి. ఆ మధ్య తమిళ హీరో శివ కార్తికేయన్ తన సినిమా ప్రమోషన్స్ ఇక్కడి రాగా.. అరి మూవీ డైరెక్టర్ జయ శంకర్‌ను కలిశాడు. అరి మూవీ గురించి మాట్లాడాడు. మూవీ ట్రైలర్‌ను చూసి మెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ సినిమా రీమేక్‌ పట్ల ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది. అన్ని ఫైనల్ అయితే.. అరి మూవీ కోలీవుడ్ ప్రేక్షకులను కూడా అలరించనుంది. 


ఇక బాలీవుడ్ కూడా అరి మూవీపై ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ వంటి హీరో అరి మూవీ గురించి ఆరా తీసినట్లు సమాచారం. హిందీలో రీమేక్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అరి మూవీ రిలీజ్‌కు ముందే రీమేక్‌ కోసం ఫుల్ డిమాండ్ ఏర్పడడంతో చిత్ర బృందం హ్యాపీగా ఫీలవుతోంది. శివ కార్తికేయన్, అభిషేక్ బచ్చన్‌లు రీమేక్‌ చేస్తారా లేదా అనేది అధికారికంగా తేలాల్సి ఉంది. అరి మూవీ త్వరలోనే ఆడియన్స్‌ను సిద్ధమవుతోంది. 


Also Read: Dil Raju: రేవంత్ రెడ్డి దగ్గరికి దిల్ రాజు.. ఆశిష్ పెళ్లికార్డ్ అందజేసిన ఫ్యామిలీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి