అల్లు అర్జున్ (Allu Arjun) లేటెస్ట్ సెన్సేషన్ అల వైకుంఠపురంలో (ala vaikuntapuramlo) సినిమా 2020 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై టాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పూజా హెడ్గే, నవదీప్, నివేదా పేతురాజ్, సుశాంత్, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. టాలీవుడ్‌లో మ్యూజికల్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాపై ప్రస్తుతం కోలీవుడ్ నిర్మాతలు దృష్టిసారించినట్టు తెలుస్తోంది. రెమో, హీరో, సీమరాజ చిత్రాల ఫేమ్ శివ కార్తికేయన్ (Siva Karthikeyan) హీరోగా ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేసేందుకు ఓ నిర్మాత ఆసక్తి కనబరుస్తున్నట్టు సమాచారం. వీలైతే తానే సొంతంగా అల వైకుంఠపురములో తమిళ రీమేక్ రైట్స్ (ala vaikuntapuramlo tamil remake rights) కొనుగోలు చేయాలని హీరో శివ కార్తికేయన్ సైతం భావిస్తున్నట్టు కోలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : ఐసోలేషన్ సెంటర్ నుంచి పరారైన ఆరుగురు కరోనా రోగులు


ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్ విషయానికొస్తే... సుకుమార్‌తో కలిసి బన్ని చేస్తోన్న పుష్ప సినిమా (Pushpa movie) షూటింగ్ ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయింది. లాక్ డౌన్ తర్వాత మళ్లీ షూటింగ్ ప్రారంభం కానుంది. పుష్ప మూవీని ప్యాన్ ఇండియా ప్రాజెక్టుగా ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో బాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్ పరిశ్రమల నుంచి నటీనటులను తీసుకోవాలని యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే ప్రస్తుతం కన్నడ యువ నటుడు ధనుంజయ్‌ని ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేసుకున్నట్టు టాలీవుడ్ టాక్. 


Also read : COVID-19 cases in Telangana: తెలంగాణలో 700 కరోనా పాజిటివ్ కేసులు


ఇదిలావుంటే, ఇటీవలే అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన పుష్ప మూవీ ఫస్ట్ లుక్‌కి (Pushpa first look) భారీ స్పందన లభించిన సంగతి తెలిసిందే. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..