హైదరాబాద్: తెలంగాణలో గురువారం కొత్తగా మరో 50 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 700 మార్కును చేరుకున్నట్టయింది. నేడు రాష్ట్రంలోని ఆస్పత్రుల నుంచి 68 మంది డిశ్చార్జ్ అయ్యారు. గురువారం డిశ్చార్జ్ అయిన వారితో కలిపి ఇప్పటివరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 186కి చేరినట్టయింది. ఏప్రిల్ 16, గురువారం వరకు కరోనాతో 18 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌గా ఉన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 496గా ఉంది. రాష్ట్రంలో యాక్టివ్‌గా ఉన్న కరోనా కేసుల్లో అధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి.
Also read : COVID-19 updates: 24 గంటల్లో 28 మంది మృతి, 13 వేలకు చేరువలో కరోనా కేసులు
240 కేసులతో జీహెచ్ఎంసీలో అత్యధిక కేసులు ఉండగా, ఆ తర్వాతి స్థానంలో నిజామాబాద్-42, వికారాబాద్-32, సూర్యాపేట-23, వరంగల్ అర్బన్-21, రంగారెడ్డి (నాన్-జీహెచ్ఎంసీ)-18, జోగులాంబ-18, నిర్మల్-17, నల్గొండ-12, ఆదిలాబాద్-11, మహబూబ్ నగర్-10 కేసులు ఉన్నాయి.
Also read : బీ అలర్ట్: తెలంగాణలో Red Zones, HotSpots ఇవే..
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా చేపట్టిన సర్వేలో ఇప్పటికే 99,257 కుటుంబాలను సర్వే చేయగా.. జనాభా పరంగా 3,97,028 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. లాక్ డౌన్‌కి సహకరించి ఇంట్లోనే సురక్షితంగా ఉండాల్సిందిగా తెలంగాణ వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..