సోనుసూద్ మానవత్వానికి విలువ కట్టడం కష్టమే... ఎందుకంటే సోనూసూద్ చేస్తున్న ప్రజా సేవ ఇంకా కొనసాగుతూనే ఉంది. లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది వలస కూలీలను వారి వారి సొంత ఊర్లకు చేర్చి వారి పట్ల దేవుడు అయ్యాడు. లాక్ డౌన్‌లో ఉపాధి కోల్పోయి తిండి లేక తిప్పలు పడుతున్న వారికి అన్నం పెట్టాడు. ఉద్యోగం కోల్పోయిన వారికి ఉపాధి మార్గం చూపించాడు. విమానాలు లేక విదేశాల్లో చిక్కుకున్న వారికి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి వారిని ఇండియాకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేశాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అన్నదాతలకు ఆపన్నహస్తం అందించాడు. అలా తన సాయం కోరిన వాళ్లకు, కోరని వాళ్లకు అందరికీ తన వంతు సాయం చేశాడు. ఎంతో మందికి ప్రత్యక్ష దైవంలా కనిపించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా తన మంచి మనసును చాటుకుంటూ ఆచార్య మూవీ షూటింగ్ సెట్స్‌లో ఆర్థికంగా వెనుకబడిన కిందిస్థాయి సిబ్బందికి స్మార్ట్ ఫోన్స్ పంచిపెట్టాడు. అలా ఒకరికి కాదు.. ఇద్దరికి కాదు.. ఏకంగా 100 మందికి స్మార్ట్ ఫోన్స్ పంచిపెట్టాడు. లాక్ డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడ్డామని, తమ పిల్లలు ఆన్‌లైన్ క్లాసులు వినడానికి స్మార్ట్ ఫోన్ ( Smartphones ) సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పడం విని కరిగిపోయిన సోనుసూద్ వెంటనే వారికి ఇలా స్మార్ట్ ఫోన్లు పంచిపెట్టడం నిజంగానే అభినందించదగిన విషయం. 


Also read : టాలీవుడ్‌పై Anchor Anasuya సంచలన వ్యాఖ్యలు


కొరటాల శివ డైరెక్షన్‌లో చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ఆచార్య మూవీలో సోనూసూద్ ( Sonu Sood ) ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. నవంబర్ నుంచి సోనూసూద్ ఆచార్య మూవీ షూటింగ్‌లో ( Acharya movie shooting ) పాల్గొంటున్నాడు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook