Sonu Sood tested positive for COVID-19: ప్రముఖ నటుడు సోనూ సూద్‌కి కరోనా సోకింది. శనివారం నిర్వహించిన కొవిడ్-19 పరీక్షల్లో (COVID-19 tests) పాజిటివ్ అని తేలింది. ఇదే విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులకు తెలియజేసిన సోనూసూద్.. ''ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని, దీని ఫలితంగా మీకు మరింత సేవ చేసి మీ సమస్యలు పరిష్కరించేందుకు తనకు ఇంకా తగినంత సమయం లభించింది'' అని తెలిపారు. ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యగా తాను క్వారంటైన్‌లోకి వెళ్లినట్టు తన సందేశంలో పేర్కొన్నారు. మీ అందరి కోసం తాను ఉన్నాననే విషయాన్ని మర్చిపోవద్దని సోనూ సూద్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ మరోసారి ఆయన మంచి మనసుకు నిదర్శనంగా నిలిచింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోనూ సూద్‌కి కరోనా సోకిందని తెలుసుకున్న అభిమానులు, నెటిజెన్స్.. తమ అభిమాన నటుడి ఆరోగ్యం త్వరగా బాగుపడాలని ఆ దేవుడిని మనసారా ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఎంతో మందికి నిస్వార్థంగా సేవ చేసిన మిమ్మల్ని కరోనా ఏమీ చేయలేదని మానసికస్థైర్యం చెబుతూ అభిమానులు సోనూ సూద్‌కి బూస్టింగ్ కూడా ఇస్తున్నారు. అన్నట్టు సోనూ సూద్ 10 రోజుల క్రితమే కరోనావైరస్ వ్యాక్సిన్ తొలి డోస్ (COVID-19 vaccine first jab) తీసుకున్నారు. 


Also read : Oxygen cylinders suppliers contacts: ఆక్సీజన్ సిలిండర్స్ కావాలా? ఇదిగో ఫోన్ నెంబర్స్


గతేడాది కేంద్రం లాక్‌డౌన్ (Lockdown in India) విధించిన అనంతరం దేశంలోని అనేక ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను (Migrant workers) వారి వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసిన సోనూ సూద్ ఎంతోమంది నిరుపేదల పాలిట దేవుడైన సంగతి తెలిసిందే. విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన వారిని సైతం భారత్‌కి తిరిగి తీసుకొచ్చే ఏర్పాట్లు చేసి వారి మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అంతేకాకుండా లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలలో కొంతమందికి తన వంతు ఆర్థిక సహాయం అందించిన గొప్ప మనసు సోనూ సూద్‌ది. అందుకే ఆయన కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థించేవారికి కూడా కొదువలేదు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe