Nithya Menen: చక్కనమ్మ చిక్కినా అందమే..నాజుగ్గా మారుతున్న నిత్యా మేనన్
Nithya Menen: దక్షిణాదిన మూడు భాషల్లో సుపరిచితమైన ముద్దుగుమ్మ నిత్యా మేనన్ ఇప్పుడు నాజూగ్గా తయారవుతోంది. చకనమ్మ చిక్కినా అందమే కదా. బహుశా అందుకే ఈ ప్రయత్నం.
Nithya Menen: దక్షిణాదిన మూడు భాషల్లో సుపరిచితమైన ముద్దుగుమ్మ నిత్యా మేనన్ ఇప్పుడు నాజూగ్గా తయారవుతోంది. చకనమ్మ చిక్కినా అందమే కదా. బహుశా అందుకే ఈ ప్రయత్నం.
కేరళ కుట్టి, అందాల తార, దక్షిణాదిన తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నిత్యా మేనన్ ఎప్పుడూ ముద్గుగానే ఉంటుంది. చక్కని అందం, అంతకు మించిన అభినయం ఆమె సొంతం. అందుకే కాస్త బొద్దుగా ఉన్నా ఆమెకు ఆదరణ తగ్గలేదనే చెప్పాలి. కమర్షియల్ చిత్రాలకు దూరంగా ఉంటూ కథ బాగుండే సినిమాల్ని ఎంచుకుంటోంది. అంతకుమించి ఎప్పుడూ ఏ సినిమాలోనూ అశ్లీలత జోలికి పోలేదనే చెప్పాలి. అందుకే నిత్యా మేనన్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఎప్పుడూ బరువు తగ్గించుకునేందుకు ప్రయత్నించలేదు కూడా. నచ్చింది తింటుంది. హ్యాపీగా ఉంటుంది.
ఇప్పుడు మాత్రం చక్కనమ్మ చిక్కినా అందమే కదా అని అనుకున్నట్టుంది. నాజూగ్గా మారేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. స్లిమ్‌గా కన్పించేందుకు కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే 6 కిలోల బరువు తగ్గిందని తెలుస్తోంది. నిత్యా మేనన్ (Nithya Menen) తాజాగా షేర్ చేసిన ఫోటోల్లో కూడా ఇదే కన్పిస్తుంది. చాలా అందంగా , స్మార్ట్‌గా ఫిదా చేస్తోంది. ఎక్కువ బరువును ఎలా తగ్గించుకోవాలో చిట్కాలు కూడా అభిమానులతో షేర్ చేసింది. వాస్తవానికి కొవ్వు తగ్గించుకునేందుకు సర్జరీ చేయించుకోవాలని చాలామంది సలహా ఇచ్చారట. కానీ సర్జరీ ఇష్టం లేక ఎప్పటికప్పుడు డైట్ నిపుణుల సలహాలు, సూచనలతో ఆహారంలో మార్పులు చేసుకుంది. వాకింగ్, వ్యాయామం అలవర్చుకుంది. 5 నెలల్నించి డైట్ కంట్రోల్ చేస్తూ 6 కిలోల బరువు తగ్గించుకుంది. తన పాత లుక్ వచ్చేంతవరకూ కష్టపడతానంటోంది నిత్యా మేనన్. స్కై ల్యాబ్ సినిమాలో నటించడమే కాకుడా నిర్మాతగా వ్యవహరించింది. త్వరలో పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లానాయక్‌లో కన్పించనుంది.
Also read: Bheemla Nayak Release: భీమ్లా నాయక్ రిలీజ్ అప్పుడే, సీఎం జగన్ పేరు చెప్పడానికి కారణం అదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook