శ్రియాశరణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న గమనం సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను పవన్ కల్యాణ్ ఇటీవలే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.
‘గమనం’ (Gamanam) సినిమా ట్రైలర్‌ను పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) విడుదల చేశారు. సుజనారావు దర్శకత్వంలో.. ఐదు భాషల్లో తెరకెక్కిస్తున్న గమనం.. తెలుగు వర్షన్ ట్రైలర్‌ను బుధవారం పవన్ కల్యాణ్ రిలీజ్ చేశారు.
Ninnila Ninnila first look details: నిత్యా మీనన్, రితు వర్మ కలిసి తెలుగులో సినిమా చేస్తున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు ఈ చిత్రానికి సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ని ట్విట్టర్ ద్వార విడుదల చేశారు. తమిళ హీరో అశోక్ సెల్వన్ ఈ సినిమాతో తెలుగు తెరకు ( Ashok Selvan's Telugu debut ) పరిచయం కానున్నాడు. కాగా ఈ సినిమాకి 'నిన్నిలా నిన్నిలా' అనే పేరును ఖరారు చేసినట్టు పోస్టర్ ఆధారంగా వెల్లడించారు.