లెజెండరీ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇలా పలు విధాలుగా చిత్రసీమకు సేవ చేసిన వ్యక్తి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balasubrahmanyam). గత మూడు వారాలుగా చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో ఆయన కరోనాకు చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ ఓ శుభవార్త చెప్పారు. చికిత్సకు తన తండ్రి ప్రస్తుతం స్పందిస్తున్నారనని మంగళవారం రాత్రి హెల్త్ బులెటిన్ (SP Balu Health update)‌ తర్వాత తెలిపారు. కరోనా ప్రమాదం నుంచి తన తండ్రి 90 శాతం బయటపడినట్లేనని పేర్కొన్నారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. England బౌలర్ జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చికిత్సకు నాన్న స్పందించే తీరు చూస్తే 90శాతం ఆయన కోలుకుంటాడని అర్థమవుతుందన్నారు. ఆయన త్వరలోనే కోలుకుని మీ ముందుకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ట్రీట్‌మెంట్‌కు, డాక్టర్లకు బాగానే స్పందిస్తున్నారని ఎస్పీ చరణ్ తెలిపారు. నాన్న ఎస్పీ బాలుకు చికిత్స అందిస్తున్న ఎంజీఎం వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. Weight Loss Tips: బొజ్జ రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి 


74 ఏళ్ల లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న కరోనా బారిన పడ్డారు. తొలుత సాధారణ లక్షణాలున్నాయని, త్వరలోనే కోలుకుంటానని వీడియో సందేశం ఇచ్చిన ఎస్పీ బాలు ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయనను ఐసీయూకు తరలించి వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సినీ ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు దేవున్ని ప్రార్థిస్తున్నారు. Effects Of Skipping Breakfast: బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఎన్ని నష్టాలో తెలుసా..!  
Shalini Vadnikatti Wedding Photos: దర్శకుడిని పెళ్లాడిన యంగ్ హీరోయిన్ 
Badam Benefits: ఉదయాన్నే బాదం తింటున్నారా.. ఈ ప్రయోజనాలు తెలుసా! 
 Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి