SP Balu: నాకేం కాదు.. ఐసీయూలో ఎస్పీ బాలు థంబ్స్ అప్ ఫోటో వైరల్
లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ ఎస్.పి.బాలసుబ్రమణ్యం ( SP Balasubrahmanyam ) ఆరోగ్యం క్షీణించినట్లు ఈ రోజు సాయంత్రం వచ్చిన వార్తలు ఆయన అభిమానులను, సంగీత ప్రియులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి.
లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ ఎస్.పి.బాలసుబ్రమణ్యం ( SP Balasubrahmanyam ) ఆరోగ్యం క్షీణించినట్లు ఈ రోజు సాయంత్రం వచ్చిన వార్తలు ఆయన అభిమానులను, సంగీత ప్రియులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. కరోనావైరస్ ( Coronavirus ) పాజిటివ్‌గా తేలిన అనంతరం ఆయన చెన్నైలోని ఎంజిఎం హెల్త్‌కేర్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇవాళ సాయంత్రం ఓ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ఎంజీఎం ఆసుపత్రి.. నిన్న రాత్రి నుండి బాలును లైఫ్ సపోర్ట్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. బాలు ఆరోగ్యం క్షీణిస్తోందని తెలియగానే ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. Also read : SP Balasubrahmanyam: బాలు ఆరోగ్య పరిస్థితి విషమం.. హెల్త్ బులెటిన్ విడుదల
ఇదే విషయమై ఎస్పీ బాలు కుమారుడు, ప్రముఖ సింగర్ ఎస్పీ చరణ్ ( SP Charan ) తమిళ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతానికి తన తండ్రి ఆరోగ్యం స్థిరంగానే ఉందని, అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని ధృవీకరించారు. అలాగే బాలు సోదరి కూడా మీడియాకు ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. బాలు కోలుకోవాలని ప్రార్థిస్తున్న వాళ్లందరికీ ఆ ఆడియో ద్వారా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. Also read :
COVID-19: ఏపీలో 24 గంటల్లో 97 మంది మృతి
రోజు సాయంత్రం ఆసుపత్రి నుండి ఎస్పీబి ( SP Balu ) తన అభిమానులకు తంబ్స్ అప్ చూపిస్తున్న ఫొటో విడుదలైంది. బాలు ఆరోగ్యం క్షీణిస్తోందని వార్తలు వెలువడిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also read : Indraprastham: చంద్రబాబు, వైఎస్ఆర్ స్నేహంపై సినిమా టైటిల్ ఇదేనా ?