Bhagavanth Kesari Special Poster: నంద‌మూరి బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) నయా మూవీ భగవంత్ కేసరి (Bhagavanth Kesari). ఈ మూవీకి అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్‌ (Kajal Aggarwal) నటిస్తోంది. మరో కీలకపాత్రలో లేటెస్ట్ సెన్షేషన్ శ్రీలీల సందడి చేయనుంది. ఇందులో బాలీవుడ్ నటుడు అర్జున్‌ రాంపాల్‌ విలన్ గా నటించనున్నాడు. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వినాయక చవితిని పురస్కరించుకుని ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది మూవీటీమ్. ఇందులో గణేష్ పాటకు డ్యాన్స్ చేస్తున్న బాలయ్యను చూడొచ్చు. ప్రస్తుతం ఈ లుక్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. భగవంత్ కేసరి మూవీ రిలీజ్ వాయిదా పడుతుందనే వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి. అయితే ముందుగా అనుకున్న తేదీకే ఈ చిత్రాన్ని తీసుకువచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబరు 19న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 



Also Read: Jawan Collections: వీకెండ్ లోనూ తగ్గని 'జవాన్' జోరు.. రూ. 800 కోట్ల క్లబ్ లో షారుఖ్ మూవీ..


ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గణేశ్ ఆంథం సాంగ్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటలో బాలకృష్ణ, శ్రీలీల వేసిన స్పెప్పులు హైలైట్ గా నిలిచాయి. 


Also Read: Ganesh Chathurthi: వెంకీమామా 'సైంధవ్' నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook