Ganesh Chathurthi: వెంకీమామా 'సైంధవ్' నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్

Saindhav Update: విక్టరీ వెంకటేష్ నయా మూవీ సైంధవ్. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. వినాయక చవితి సందర్భంగా స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 18, 2023, 04:33 PM IST
Ganesh Chathurthi: వెంకీమామా 'సైంధవ్' నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్

Saindhav Movie Special Poster: విక్టరీ వెంకటేష్ సోలో హీరోగా హిట్ కొట్టి చాలా ఏళ్లే అయింది. ప్రస్తుతం వెంకీమామా చేస్తున్న చిత్రం 'సైంధవ్'(Saindhav Movie). ఇది వెంకీకి 75వ సినిమా. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి హిట్ సిరీస్ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ మూవీపై జనాల్లో ఎనలేని క్యూరియాసిటీని కలిగించాయి. వినాయక చవితి సందర్భంగా ఈ మూవీ నుంచి మరో అప్ డేట్ ను వదిలారు మేకర్స్. హీరోయిన్‌ శ్రద్ధా శ్రీనాథ్‌, ఓ చిన్న పాపతో కలిసి వెంకటేష్‌ బీచ్‌ ఒడ్డున కూర్చుని నవ్వుతున్న ఫోటోలను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శ్రీలంకలో జరుగుతుంది. అక్కడ  భారీ యాక్షన్‌ సీన్స్‌తో పాటు కొంత టాకీ పార్టును కూడా చిత్రీకరించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో బ్లాక్‌ మ్యాజిక్ కూడా కీ రోల్ పోషించనున్నట్లు తెలుస్తోంది. ఈ కాన్సెప్ట్ కు బలమైన డాటర్ సెంటిమెంట్‌ను జోడించి శైలేష్ ఎంతో ఆసక్తికర కథగా మలిచాడంట. నిహారిక ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. 

ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ సీనియర్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇందులో ఆండ్రియా జెర్మియా, రుహాని శర్మ, హీరో ఆర్య కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మూవీని తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. 

Also Read: Jawan Collections: వీకెండ్ లోనూ తగ్గని 'జవాన్' జోరు.. రూ. 800 కోట్ల క్లబ్ లో షారుఖ్ మూవీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News