Bhala Thandanana: ఓటీటీలోకి శ్రీవిష్ణు ‘`భళా తందనాన`.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Bhala Thandanana: శ్రీవిష్ణు నటించిన `భళా తందనాన` చిత్రం ఓటీటీ రిలీజ్ కు సిద్దమైంది. విడుదలైన 15 రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
Bhala Thandanana ott Streaming date: యువ నటుడు శ్రీ విష్ణు (Sree Vishnu), కేథరిన్ జంటగా నటించిన చిత్రం 'భళా తందనాన' (Bhala Thandanana Movie). వారాహి చలనచిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి ఈ సినిమాను నిర్మించారు. సాయి కొర్రపాటి సమర్పించిన ఈ చిత్రానికి చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమా మే 6న రిలీజ్ అయింది. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఫ్యాన్స్ ను మెప్పించలేకపోయింది. ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, సత్య తదితరులు కీలకపాత్రలు పోషించారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించారు.
విడుదలైన 15 రోజులకే ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా మే 20 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ (Bhala Thandanana ott Streaming date) చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో (Disney Plus Hotstar) మే 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అవినీతిపై ఒక జర్నలిస్ట్‌తో కలిసి సామాన్య వ్యక్తి చేసిన పోరాటంగా ఈ మూవీ తెరకెక్కింది. వెండితెరపై పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం ఓటీటీలో ఏంతమేర ఆకట్టుకుందో వేచి చూడాలి.
Also Read: RRR OTT Release Date: 'ఆర్ఆర్ఆర్' మూవీ ఓటీటీ రిలీజ్ ముహూర్తం కుదిరింది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.