Sreeleela: పేరుకి ఫ్లాప్ హీరోయిన్.. కానీ బాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుకుంటున్న నటి..
Sreeleela Upcoming Movies: టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసిన శ్రీలీల గత కొంతకాలంగా వరుస ప్లాప్స్.. అందుకుంటుంది. అయితే తాజాగా ఇప్పుడు శ్రీ లీల బాలీవుడ్ లో అడుగుపెడుతున్న.. సంగతికి తెలిసిందే. ఆమె మొదటి సినిమా.. ఇంకా విడుదల కాలేదు కానీ అప్పుడే.. మరొక బాలీవుడ్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం.
Sreeleela in Bollywood: పెళ్లి సందడి ధమాకా సినిమాలతో.. వరుసగా సూపర్ హిట్ లు అందుకున్న శ్రీలీల ఇండస్ట్రీలోనే.. స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. శ్రీలీలపై ఆఫర్ల వర్షం కురిసింది. అయితే వచ్చిన ప్రతి సినిమాకి.. సైన్ చేసుకుంటూ వెళ్లిన శ్రీ లీల.. ఆ తర్వాత మాత్రం వరుస డిజాస్టర్ లతో.. ఐరన్ లెగ్ గా మారిపోయింది.
ఈ మధ్యనే మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాతో కూడా శ్రీలీలకి అనుకున్న స్థాయిలో.. హిట్ లభించలేదు. 2023లో భగవంత్ కేసరి సినిమా తప్ప శ్రీలీల.. నటించిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. మహేష్ బాబు వంటి స్టార్ హీరోతో.. నటించినా కూడా ఆమెకి మంచి ఆఫర్లు రాలేదు.
అయినప్పటికీ శ్రీ లీల ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల.. జాబితాలో మాత్రం తప్పు కోలేదు. తెలుగు నుంచి కాకపోయినా.. శ్రీలీలకి వేరే భాష నుంచి బాగానే ఆఫర్లు వస్తున్నాయి. బాలీవుడ్ లో కూడా శ్రీలీల త్వరలో.. అడుగుపెట్టబోతున్న సంగతికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు బాలీవుడ్ లో మరొక సినిమా.. సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్.. త్వరలో ఇండస్ట్రీలో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఆ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా.. నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్.. కూడా హిందీలో బాగానే సినిమాలు చేస్తూ ఉంది. ఈ రకంగా ఇబ్రహీం అలీ ఖాన్ కూడా బాలీవుడ్ ప్రేక్షకులకు.. బాగానే సుపరిచితుడు.
ఇక ఈ సినిమా కాకుండా శ్రీలీలకి బాలీవుడ్ స్టార్ హీరో.. వరుణ్ ధావన్ తో కూడా ఒక సినిమా చేసే అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం వరుణ్ ధావన్ సమంత హీరో హీరోయిన్లుగా సిటాడెల్ అనే వెబ్ సిరీస్ త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతుంది. ఇప్పుడు అదే వరుణ్ ధావన్ తో శ్రీలీల.. కూడా నటించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారని సమాచారం.
మృణాల్ ఠాకూర్ శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఒకవేళ ఈ రెండిట్లో ఒకటి హిట్ అయినా కూడా శ్రీలీల కి వరుస ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు శ్రీలీల తెలుగులో కూడా పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, నితిన్ తో రాబిన్ హుడ్ సినిమాల్లో కూడా నటిస్తోంది. రవితేజ భాను భోగవరపు సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్ గా కనిపించనుంది.
Also Read: Pension Hike: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జూలై 1న పండగే.. ఒక్కొక్కరికి రూ.7 వేలు
Also Read: Hyper Aadi: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వాడేసుకుంటున్న కమెడియన్ హైపర్ ఆది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter