Sreeleela Dance : మూడేళ్లకే మొదలుపెట్టిందట.. శ్రీలీల మామూల్ది కాదు
Sreeleela Dance in Dhee శ్రీలీల డ్యాన్సులకు ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. శ్రీలీల ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ అయింది. రానున్న రెండేళ్లకు సరిపడా సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. దాదాపు డజను సినిమాలతో శ్రీలీల ఫుల్ బిజీగా ఉంది.
Sreeleela Dance in Dhee టాలీవుడ్‌లో ఇప్పుడు క్రేజ్ ఉన్న హీరోయిన్ ఎవరు? ఫాంలో ఉన్న బ్యూటీ ఎవరు? అంటే అందరూ శ్రీలీల పేరు చెప్పాల్సిందే. శ్రీలీల వరుసగా ఆఫర్లు పట్టేసుకుంటోంది. ఇప్పటికే ఆమె డైరీలో డేట్స్ ఖాళీగా లేవని టాక్. రానున్న రెండేళ్లకు సరిపడా సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. స్టార్ హీరోలంతా కూడా ఆమెనే ఎంచుకుంటున్నారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇలా స్టార్ హీరోలంతా కూడా శ్రీలీలకే ఓటేస్తున్నారు. అలా శ్రీలీల పేరు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది.
శ్రీలీల డ్యాన్సులకు అంతా ఫిదా అవ్వాల్సిందే. సాయి పల్లవి తరువాత ఈ తరం హీరోయిన్లలో శ్రీలలకే మళ్లీ ఆ రేంజ్ క్రేజ్ వచ్చింది. శ్రీలీల వేసే స్టెప్పులు, గ్రేస్‌తో చేసే డ్యాన్స్‌కు అంతా ఆశ్చర్యపోతోంటారు. ధమాకా సినిమాలో రవితేజతో కలిసి శ్రీలీల చేసిన డ్యాన్స్‌లు బాగానే వైరల్ అయ్యాయి. అది వంద కోట్ల క్లబ్బులో చేరడానికి శ్రీలీల కూడా కారణం. అలా వంద కోట్ల భామగా శ్రీలీలకు టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.
ఢీ షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు టాప్ డ్యాన్సర్లు గెస్టులుగా వస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఇది వరకు బన్నీ, ఎన్టీఆర్, ప్రభుదేవా వంటి వారు గెస్టులుగా వచ్చి సందడి చేశారు. ఇక ఇప్పుడు శ్రీలీల గెస్టుగా వచ్చింది. దీనికి సంబంధించిన ప్రోమోను ఇప్పుడు విడుదల చేశారు. ఇందులో శ్రీలీల తన పాస్ట్ గురించి చెప్పుకొచ్చింది. చిన్నప్పటి నుంచే డ్యాన్స్ మీద పట్టుందని చెప్పేసింది.
Also Read: Ram Charan Speech : నందమూరి అభిమానుల మనసు గెలిచిన రామ్ చరణ్.. ఎన్టీఆర్‌పై స్పీచ్ అదుర్స్
మూడేళ్లకే డ్యాన్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టేశానని, ఇంట్లో అమ్మే తనను జాయిన్ చేయిందని, డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి వచ్చే సరికి కాళ్లు బొబ్బలు ఎక్కేవని, దీనికి బధులు స్కూల్‌కు వెళ్లి చదువుకుంటాను అని అనేదాన్ని అంటూ శ్రీలీల తన ట్యాలెంట్ గురించి చెప్పుకొచ్చింది. మొత్తానికి శ్రీలీల మాత్రం తన గ్రేస్, స్టైల్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు మహేష్ బాబు త్రివిక్రమ్, పవన్ కళ్యాణ హరీష్ శంకర్ కాంబో సినిమాతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
Also Read: Anasuya Bikini Pics : మొదటి సారిగా బికినీలో అనసూయ.. ఫ్యామిలీ ఫ్యామిలీ మునిగిందిగా?.. పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook