Sreeleela Upcoming Projects శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్‌ హాట్ కేకులా ఉంది. ఏ హీరోను కదిలించిన శ్రీలీల కావాలనే పరిస్థితి ఏర్పడింది. స్టార్ హీరో నుంచి కుర్ర హీరోల వరకు తమ తమ సినిమాల్లో శ్రీలీలను పెట్టుకోవాలని చూస్తున్నారు. దర్శక నిర్మాతలు సైతం శ్రీలీల వైపే మొగ్గు చూపుతున్నారు. పెళ్లి సందD సినిమాతో శ్రీలీల అందరినీ కట్టి పడేసింది. ఆ సినిమాతో రోషన్‌కు ఎలాంటి లాభం కలిగిందో చెప్పలేం గానీ శ్రీలీల కెరీర్ మాత్రం మారిపోయింది. ఈ కన్నడ సుందరిని ఇప్పుడు తెలుగు వాళ్లు నెత్తిన పెట్టేసుకుంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రష్మిక, పూజా, కృతి శెట్టి, కీర్తి సురేష్ ఇలా అందరూ కూడా ఒక్కసారిగా తెలుగులో ఇబ్బడి ముబ్బడిగా ఆఫర్లు దక్కించుకున్నవారే. సమంత సైతం ఒకప్పుడు ఫుల్ బిజీగా ఉండేది. అయితే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీలీల అంత బిజీగా ఎవ్వరూ లేరు. ఉప్పెనతో కృతి శెట్టికి క్రేజ్ వచ్చింది. కానీ వరుసగా ఇష్టమొచ్చిన చిత్రాలు చేయడం, అవన్నీ ఫ్లాప్ అవ్వడంతో ఆమెను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. గత ఏడాది ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి.


రష్మికకు తెలుగులో ఇప్పుడు ఒక్క ప్రాజెక్ట్ (పుష్ప ది రూల్‌) మాత్రమే ఉంది. పూజా హెగ్డేకు మహేష్‌ బాబు సినిమా ఉంది. సమంతకు ఖుషి సినిమా ఉంది. ఇలా స్టార్ హీరోయిన్లు అని చెప్పుకునే వారందరికీ ఒకటి రెండు సినిమాలో చేతిలో ఉన్నాయి. కానీ శ్రీలీల చేతిలో మాత్రం దాదాపు ఆరేడు సినిమాలున్నాయి.


శ్రీలీల కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా, కూతురి పాత్ర, హీరోయిన్‌గా నటిస్తోంది. మహేష్‌ బాబు త్రివిక్రమ్ కాంబోలో రాబోతోన్న చిత్రంలో పూజా హెగ్డేతో పాటు శ్రీలీల కనిపించబోతోంది. అనిల్ రావిపూడి బాలయ్య సినిమాలో కూతురి పాత్రలో నటిస్తోంది. బోయపాటి రామ్, నితిన్ 32వ సినిమా, నవీన్ పొలిశెట్టి కొత్త చిత్రం, వైష్ణవ్ తేజ్ నాలుగో సినిమా, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోనూ తీసుకునే అవకాశాలున్నాయి. ఇంకా కొన్ని ప్రాజెక్టులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.


ఇలా శ్రీలీల ఇప్పుడు చేతిలో దాదాపు పది చిత్రాల వరకు పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు ఒప్పుకున్న సినిమాల్లో కనీసం మూడు నాలుగు బ్లాక్ బస్టర్ హిట్లు అయినా కూడా శ్రీలీల కెరీర్‌ ఇంకో లెవెల్‌కు వెళ్తుంది. స్టార్ హీరోయిన్లు, నంబర్ వన్ హీరోయిన్లు ఇలా అందరూ కూడా శ్రీలీలకు సైడ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.


Also Read:  Anupama Parameswaran Saree pics : కొప్పున పూలెట్టుకొని.. అందమంటే అనుపమదేనా?.. చీరకట్టుకే కళ వచ్చిందా?


Also Read: Amala Akkineni : కుక్కల మీద అలాంటి కామెంట్లు చేసిందా?.. అమల నిజంగానే అలా అనేసిందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook