Nita Ambani Beauty Secret: నీతా అంబానీ.. ఈ పేరు చెబితే వెంటనే గుర్తుకు వచ్చేది ఆమె అందం. ఈ వయసులో కూడా అందానికి నిర్వచనంలో ఎంతో యంగ్ గా కనిపించే నీతా అంబానీ చాలా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోరు. అలా డైట్ విషయంలో ఎంతో స్ట్రిక్ట్ గా ఉంటారు కాబట్టి ఈ వయసులో.. కూడా అంత యంగ్ గా కనిపిస్తున్నారు. నీతా అంబానీ తీసుకునే రోజువారి డైట్ లో ..కచ్చితంగా ఈ ఒక్క పదార్థం ఉంటుంది. ఇంతకీ ఆ సీక్రెట్ ఏమిటో తెలుసుకుందాం పదండి..
ఆసియా బిలియనీర్.. భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్త ,రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్యగా మాత్రమే కాక నీతా ఒక సోషల్ వర్కర్ గా.. ఎంటర్ప్రెన్యూర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 55 ఏళ్ల వయసులో కూడా నీతా అంబానీ చాలా యాక్టివ్ గా ఉంటారు. అయితే దీనికి కారణం ఆమె డైట్ అని చెబుతున్నారు ఆమె సన్నిహితులు.
కాగా డైట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని నీతా అంబానీ తన ఆహారంలో ఆకుకూరలు, పండ్లు, తాజా కూరగాయలు పుష్కలంగా ఉండేలా చూసుకుంటారట. అలాగే రాత్రిపూట ఆమె క్రమం తప్పకుండా వెజిటేబుల్ సూప్ కూడా తీసుకుంటారట. వీటితో పాటుగా ప్రతిరోజు యోగా, వ్యాయామం తప్పనిసరిగా చేస్తారు. నీతా అంబానీ మంచి డాన్సర్.. ఆమెకు డాన్స్ అంటే ఎంతో ఇష్టం కూడా.. అందుకే ఆమె ఎప్పుడూ క్లాసికల్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారట. ఆమె ఫిట్నెస్ కు ఇది కూడా ఒక రీజన్ అని చెబుతారు. కాగా ఆమె తీసుకునే ఆహారంలో ముఖ్యమైనది బీట్రూట్ జ్యూస్. రోజు తప్పనిసరిగా ఆమె ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తీసుకుంటారట.
ఈ జ్యూస్ లో తక్కువ క్యాలరీలో ఉండడంతో పాటు ఎక్కువ ఫైబర్ శరీరానికి అందుతుంది. ఇందులో పుష్కలంగా లభించే విటమిన్ సి,యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బీట్రూట్ రోజు తీసుకోవడం వల్ల చర్మం తాజాగా ,యవ్వనంగా ఉంటుంది. పైగా బీట్రూట్ జ్యూస్ రక్తపోటును అదుపులో ఉంచి రక్తహీనతను తగ్గిస్తుంది. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేసి జీర్ణవ్యవస్థను బలంగా మారుస్తుంది. ఈ జ్యూస్ చేసుకోవడం కూడా ఎంతో సులభమే.
మరి ఇంత అద్భుతమైన గుణాలు కలిగిన ఆ బీట్రూట్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
బీట్రూట్ జ్యూస్ తయారీ విధానం:
బీట్రూట్ ముక్కలను మిక్సీలో వేసి తగిన మోతాదులో నీటిని కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోండి. టేస్ట్ కు తగ్గట్టుగా ఇందులో కాస్త అల్లం చెక్క, పుదీనా కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ జ్యూస్ ని వడగట్టి ఎంచక్కా కాస్త చల్లగా తాగేస్తే సరిపోతుంది. మరి మీరు కూడా ఆలస్యం చేయకుండా నీతా అంబానీ ఫేమస్ బీట్రూట్ జ్యూస్ ని మీ డైట్ లో కూడా భాగంగా మార్చుకోండి.
Also Read: KT Rama Rao: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నిరాశే.. కానీ ఫినీక్స్ పక్షిలాగా తిరిగి పుంజుకుంటాం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook