Sreemukhi: `రామలక్ష్మణులు ఫిక్షనల్`.. నేనూ ఒక హిందూవును అంటూ శ్రీముఖి క్షమాపణ వీడియో వైరల్..
Sreemukhi Viral Video: `సంక్రాంతికి వస్తున్నాం` సినిమా ట్రైలర్ లాంచ్ లో భాగంగా శ్రీముఖి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సారీ చెప్పింది. ఈ సినిమా లాంచ్‌లో పాల్గొన్న శ్రీముఖి రామలక్ష్మణుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీనిపై సారీ చెబుతూ వీడియో సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Sreemukhi Viral Video: 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఈ సంక్రాంతి విడుదల అవుతోంది. అయితే నిజామాబాద్ లో ఇటీవల ఈ సినిమా ట్రైలర్ లాంచ్ నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్‌కు శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరించారు. అయితే దిల్ రాజు అతని సోదరుడు శిరీష్ గురించి మాట్లాడుతూ రామలక్ష్మణులు ఫిక్షనల్.. కానీ వీరు నిజ జీవితంలో రామ లక్ష్మణుల్లా కలిసి ఉంటారు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది శ్రీముఖి. ఫిక్షనల్ అంటే తెలుగులో 'కల్పితం' అని అర్థం. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా శ్రీముఖిని ట్రోల్స్ చేస్తున్నారు. కొన్ని హిందుత్వ గ్రూపులు రామ లక్ష్మణ గురించిన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్రీముఖి సారీ చెప్పాల్సిందే అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఈ నేపథ్యంలో శ్రీముఖి ఆ వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేసింది. 'నేను కూడా హిందువునే, రామలక్ష్మణులు ఫిక్షనల్ అన్నందుకు క్షమించండి. రాముని ఎంతగానో నమ్ముతాను'. అని ఓ వీడియో విడుదల చేసింది. 'నేను దైవ భక్తురాలిని అందులో రామ భక్తురాలిని నేను చేసిన పొరపాటు వల్ల చాలామందికి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటివి మరోసారి జరగకుండా జాగ్రత్త పడతాను దయచేసి పెద్ద మనసుతో క్షమించండి జైశ్రీరామ్' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇదీ చదవండి: ఈ రాష్ట్రంలో కూడా బీఎస్‌ఎన్‌ఎల్ IFTV సేవలు.. సెటప్ బాక్స్ లేకుండా 500 లైవ్ ఛానల్స్..
శ్రీముఖి ఒక్కసారిగా అలాంటి వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెట్టిజన్‌లు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. గ్రాండ్ ఈవెంట్లో హోస్ట్‌గా వ్యవహరించిన యాంకర్ శ్రీముఖి ఇలా హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిందని ఫైర్ అయ్యారు. అసలు రామలక్ష్మణులు కల్పితం అని నువ్వు ఎలా చెబుతావు? అని సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న శ్రీముఖి సారీ చెబుతూ ఈ పోస్ట్ వీడియోను రిలీజ్ చేసింది.
శ్రీముఖి 'పటాస్' షో ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత బిగ్ బాస్ 3 తెలుగు రియాల్టీ షోలో ఎంట్రీ ఇచ్చారు. ఈ షో లో ఆమె రన్నరప్‌గా నిలిచారు. ప్రస్తుతం 'ఆదివారం పరివారం' షో కు హోస్ట్‌గా వ్యవహరిస్తుంది. ఇది స్టార్ మా లో ప్రతి ఆదివారం టెలిక్యాస్ట్ అవుతుంది. మంచి రేటింగ్‌తో దూసుకుపోతుంది. సీరియల్ నటులతో ఈ షో నిర్వహిస్తున్నారు. వారికి ఆటలు, పాటలు పెడుతూ మంచి ఎంటర్‌టైన్మెంట్ అందిస్తున్నారు.శ్రీముఖి కూడా తనదైన స్టైల్‌లో హోస్టింగ్ చేస్తూ అలరిస్తోంది.
ఇదీ చదవండి: హైదరాబాద్ లో ఉత్తర ద్వార దర్శనం జరిపే ప్రముఖ వైష్ణవ దేవాలయాలు ఇవే..
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో వేంకటేష్ హీరోగా నటించారు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరీ హీరోయిన్లగా నటించారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. అనీల్ రావిపుడి ఈ సినిమాను డైరెక్ట్ చేయగా, ప్రొడ్యూసర్‌గా దిల్ రాజ్ పనిచేశారు. ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానుంది. సంక్రాంతి సినిమా బరిలో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook