దేశంలో తొలి సూపర్‌స్టార్ హీరోయిన్ ఆమె ఒక్కర్తే. ఇప్పటికీ మరొకరు ఆ స్థానం భర్తీ చేయలేకపోయారు. అమితాబ్ బచ్చన్, జితేంద్ర, ధర్మేంద్ర వంటి సూపర్ స్టార్స్ ఏలుతున్న సమయంలోనే హిందీ పరిశ్రమను ఏలిన రారాణి ఆమె. అందుకే ఎప్పటికీ ఫరెవర్ ఎవర్ సూపర్‌స్టార్ హీరోయిన్ శ్రీదేవి మాత్రమే. ఆమె వర్ధంతి సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2018 సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన మరణించిన శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ యాంగర్ అయ్యప్పన్. పుట్టింది 1963 ఆగస్టు 13వ తేదీ. తెలుగు సినీ నటిగా ప్రస్థానం ప్రారంభించి..తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో నటించి..బాలీవుడ్ నటిగా స్థిరపడింది. అత్యధిక ప్రజాదరణ కలిగిన హీరోయిన్‌గా ఇండస్ట్రీ హద్దుల్ని చెరిపేసింది. ఐదేళ్ల క్రితం తుది శ్వాస విడిచేవరకూ హిందీ పరిశ్రమలో మకుటం లేని మహారాణి. 55 ఏళ్ల వయస్సుకే మరణించినా..అందరి హృదయాల్లో ఇప్పటికీ ఎప్పటికీ ఉంటుంది ఆమె.


చాందినీ నుంచి శశి వరకూ ఎన్నో అద్భుత పాత్రలు పోషించిన శ్రీదేవి సద్మా నుంచి ఇంగ్లీషు వింగ్లీషు వరకూ సినీ ప్రస్థానాన్ని కొనసాగించింది. 


సద్మా సినిమాతో అందరినీ విశేషంగా ఆకర్షించింది ఆకట్టుకుంది. హిందీ సినిమా కెరీర్‌కు పునాది పడింది ఈ సినిమాతోనే. తమిళ సినిమాను రీమేక్ చేసి తీసిన సద్మాలో ఆమె నటన అందర్నీ కంట తడి పెట్టిస్తుంది. 


చాందిని సినిమాతో 1980 దశకంలో హిందీ చలన చిత్ర పరిశ్రమలో కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. ఆమె అందానికి అందరూ ఫిదా అయ్యారు. మ్యూజికల్ హిట్ కావడంతో ఇక తిరుగులేకపోయింది.


మిస్టర్ ఇండియా సినిమాతో దేశాన్నే కదిలించేసింది. శక్తివంతమైన, కీలకమైన పాత్ర పోషించడమే కాకుండా..ఈ సినిమాతో  హిందీ చలనచిత్ర పరిశ్రమలో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా అవతరించింది. హవా హవాయి పాటలో కాటే నహి చుబ్తే పాటల్తో ఆమె ఎలా అందర్నీ ఆకట్టుకుందో వర్ణించనలవి కాదు. 


చాల్‌బాజ్ సినిమాతో ట్విట్ పాత్ర పోషించింది. అంజు, మంజు పాత్రల్లో అందర్నీ మెప్పించడమే కాకుండా ఆమెలోని కామెడీ కోణం ఈ సినిమాతో వెలుగు చూసింది.


ఖుదా గవా సినిమాలో అమితాబ్ బచ్చన్ , శ్రీదేవి కెరిర్‌లకు చాలా ముఖ్యమైంది. ఈ ఇద్దరూ బాక్సాఫీసు వద్ద హిట్ కోసం చూస్తున్న తరుణంలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. 


లంమ్హేలో యాశ్ చోప్రా శ్రీదేవితో మరోసారి అద్భుత దృశ్యకావ్యాన్ని అందించాడు. తల్లిగా, కూతురిగా ద్విపాత్రాభినయం చేసిన శ్రీదేవి సినిమా అప్పట్లో ఓ హిట్. 


ఇంగ్లీషు వింగ్లీషు సినిమాతో 15 ఏళ్లు సుదీర్ఘ విరామం తరువాత శ్రీదేవి తిరిగి ఎంట్రీ ఇచ్చింది. గౌరి షిండే తెరకెక్కించిన ఇంగ్లీషు వింగ్లీషు సినిమాకు టొరెంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్టాండింగ్ ఒవేషన్ దక్కింది. వెండితెరపై ఆమె ఓ అద్భుతం. ఓ అందగత్తె. అందం అభినయం రెండూ దేనికవేసాటిగా నిలిచే నిలువెత్తు రూపం. అయినా..ఆమె మరణం ఇప్పటికీ ఓ మిస్టరీ.


Also read: Mirnalini Ravi: బీచ్‌లో మృణాళిని రవి రచ్చ.. అందాల బౌండరీ క్రాస్ చేసిందిగా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook