Srikanth Iyengar: దరిద్రానికి విరోచనాలు వస్తే రివ్యూ రైటర్లు పుడతారు..ఐడియా లేని నా కొడుకులు: శ్రీకాంత్ అయ్యంగార్ సెన్సేషనల్ కామెంట్స్..
Srikanth Sensational comments on Reviewers: విలక్షణ నటుడిగా తనకంటూ ఒక పేరు దక్కించుకున్న ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వీరప్పన్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఈ సినిమా తాలూకు రివ్యూస్ అన్నిట్లో కూడా ఆయనకు మంచి ప్రాధాన్యత లభించింది. అవకాశాలు కూడా తలుపు తట్టాయి. పలు సినిమాలలో మంచి పాత్రలు లభించాయి.
Srikanth Iyengar: అభినయంతో నటనతో తన ప్రతిభను చూపుకోవాల్సిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ బీర్లు తాగుతూ దానిపై రివ్యూస్ వెటకారంగా ఇస్తాడు.అదేమంటే నేను తాగిన ద్రవం పట్ల స్పందన ఇది అంటాడు. అయితే ఈయన మాత్రం తాను తాగిన బీరు పట్ల స్పందించవచ్చు కానీ ఈయన సినిమా చూసిన వారు తమ అభిప్రాయాలను చెప్పకూడదట. విశ్లేషణలు రాయకూడదట. ఈ నేపథ్యంలోనే ఈయనపై కొన్ని కామెంట్లు మీడియాలో వ్యక్తమవడంతో ఇప్పుడు మీడియాపై ఏకంగా మండిపడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.
అసలు విషయంలోకి వెళ్తే.. పొట్టేల్ సక్సెస్ మీట్ సందర్భంగా సినిమా రివ్యూస్ రాసే వాళ్ళు పెంట కన్నా దరిద్రులు అంటూ చాలా దారుణంగా తిట్టాడు. ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తిని అంటూ మొదలుపెట్టిన ఈయన రివ్యూయర్లపై దారుణమైన పదజాలంతో తిట్టాడు.
ఆయన మాట్లాడుతూ..” దరిద్రానికి విరోచనాలు వస్తే రివ్యూ రైటర్లు పుడతారని కామెంట్లు చేశారు. షార్ట్ ఫిలిం తీయడం కూడా రాని.. నా కొడుకులు వచ్చి ఇప్పుడు రివ్యూలు రాస్తారు. సినిమా తీయండి అసలు ఎంత కష్టమో మీకే తెలుస్తుంది. అసలు సినిమా అంటే ఏంటో రఫ్ ఐడియా కూడా లేని నా కొడుకులు. అందుకే ప్రజలు ఉన్నారు. ప్రేక్షక దేవుళ్ళు ఉంటారు. సినిమాని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తారు. కష్టపడి, శ్రమించి, చమటోడ్చి.. ప్రాణాలు పణంగా పెట్టి సినిమాలు తీస్తూనే ఉంటాము,” అంటూ తనదైన శైలిలో శ్రీకాంత్ మాట్లాడాడు. దీంతో మీడియా మిత్రులు సైతం మండిపడుతున్నారు.
ఈ విషయం చూసి మీడియా మిత్రులు కూడా ఫైర్ అవుతున్నారు. ప్రమోషన్స్ కి కావాలి.. అన్నా ఈ దరిద్రపు విరోచనాలు వచ్చే రైటర్సే మీకు కావాలి. సినిమా ఓపెనింగ్ మొదలుకొని రిలీజ్ వరకు బిట్ టూ బిట్ మీ సినిమాలు వీరే ప్రమోట్ చేయాలి. అలాంటిది ఇప్పుడు మీ సినిమా గురించి రివ్యూ రాస్తే ఇంత చండాలంగా మాట్లాడుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మీడియాతో పెట్టుకున్న శ్రీకాంత్ కి మీడియా మిత్రులు ఏవిధంగా తాము ఏంటో నిరూపిస్తారో చూడాలి.
Also Read: Ponguleti Srinivas Reddy: పొంగులేటి మార్క్ రాజకీయం.. ఖమ్మంలో ఆ పార్టీ నేతలకు బంపరాఫర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter