Srivalli Full Video Song Release: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం 'పుష్ప' (Pushpa Movie). ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో...ఈ సినిమాలో సాంగ్స్ కూడా అదే రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలోని  ‘'శ్రీవల్లి'పాట (Srivalli song) అయితే 2021లో బెస్ట్ సాంగ్ గా నిలిచిపోయింది. ఈ గీతాన్ని చంద్రబోస్ రాయగా..సిధ్ శ్రీరామ్ అద్భుతంగా అలపించారు. దేవీశ్రీప్రసాద్ సంగీతమందించారు. తాజాగా సోషల్‌ మీడియా వేదికగా ‘శ్రీవల్లి’ ఫుల్‌ వీడియోను (Srivalli Full Video Song) మంగళవారం విడుదల చేసి..సర్  ప్రైజ్ చేసింది చిత్రబృందం.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాపీస్ రికార్డులను తిరగరాస్తుంది. అదిరిపోయే వసూళ్లుతో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌లు అందిస్తోంది. ఇప్పటికే డైలాగ్‌ ప్రోమోలు, డిలీటెడ్‌ సన్నివేశాలను విడుదల చేసింది. తాజాగా శ్రీవల్లీ పుల్ వీడియో సాంగ్ ను విడుదల చేసింది. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సునీల్‌, అనసూయ (Anasuya Bharadwaj), అజయ్‌ ఘోష్‌, ఫహద్‌ ఫాజిల్‌ తదితరులు కీలక పాత్రలతో మెప్పించారు. ఈ సినిమా కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. 


Also Read: Pushpa OTT release date: అతి త్వరలో ఓటీటీలో పుష్ప మూవీ స్ట్రీమింగ్.. ఏ ఓటిటిలో ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే!


త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్
పుష్ప మూవీ త్వరలో ఓటీటీలో (Pushpa movie on OTT) కూడా రిలీజ్‌ కానుందని టాక్. మరో మూడు రోజుల్లో అంటే జనవరి 7వ తేదీన అమెజాన్‌ ప్రైమ్‌లో (Amazon Prime) పుష్ప మూవీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అయితే పుష్ప తెలుగు వెర్షన్‌ను ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో (Aha OTT Platform) విడుదల చేస్తారనే టాక్ కూడా నడుస్తోంది. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మాత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో పుష్ప మూవీ స్ట్రీమింగ్ (Pushpa Movie OTT streaming) అవుతుందని సమాచారం. త్వరలోనే పుష్ప యూనిట్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.