Sid Sriram: ఏదో తెలియని మ్యాజికల్ మ్యూజిక్ సెన్సేషన్ అతడు. పుట్టింది ఇక్కడే అయినా పెరిగింది..సంగీతం నేర్చుకుంది విదేశీ గడ్డపై. అయినా ఇప్పుడిక్కడే పాటల ప్రపంచాన్ని శాసిస్తున్నాడు. అతడెవరో.పారితోషికం ఎంతో తెలుసా


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు, తమిళ భాషలతో పాటు కన్నడ, మళయాలంలో కూడా ప్రత్యేకత నిరూపించుకుంటూ దూసుకుపోతున్న సింగర్ సిద్ధ్ శ్రీరామ్. పేరుకు తగ్గట్టే ఏదో తెలియని సిద్ధత్వం ఉంది అతడి గాత్రంలో. బహుశా అందుకే అతడి ఏ పాటను ఎన్నిసార్లు విన్నా..మళ్లీ మళ్లీ వినాలన్పిస్తుంది. ఏదో తెలియని మ్యాజిక్ అతడి గొంతులో ప్రత్యేకత. అందుకే ప్రేక్షకుల్ని అంతలా కట్టిపడేస్తాయి అతడి పాటలు. తెలుగు, తమిళ భాషల్లో ఇంతగా ప్రత్యేకత సంపాదించిన సిద్ధ్ శ్రీరామ్ (Sid Sriram) పుట్టింది చెన్నైలో అయినా..ఏడాది వయస్సులోనే అమెరికాకు వలసవెళ్లిపోయాడు తల్లిదండ్రులతో కలిసి. శాన్‌ఫ్రాన్సిస్కోలో విద్యాభ్యాసం, అక్కడే సంగీతంలో శిక్షణ పొంది..అక్కడి నుంచే పాటలతో ఇక్కడి సినీ పరిశ్రమను ఆకట్టుకున్నాడు.


ట్యాక్సీవాలా సినిమాలో మాటే వినదుగా అన్నా సరే..అల వైకుంఠపురంలో సామజవరగమన అంటూ పరుగులెట్టించినా..నీలి నీలి ఆకాశమంటూ హద్దులు దాటించినా..మగువా..మగువా అంటూ మహిళా లోకాన్ని ఉత్తేజపర్చినా..పాట ఏదైనా సిద్ధ్ శ్రీరామ్ స్టాంప్ కచ్చితంగా ఉండేలా ఉంటాయి. తాజాగా పాన్ ఇండియా సినిమా పుష్పలో శ్రీవల్లితో (Srivalli Song)సృష్టించిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఇంతలా సమ్మోహనపరుస్తున్న సిద్ధ్ శ్రీరామ్ (Sid Sriram Remuneration) ఒక్కొక్క పాటకు7 లక్షల వరకూ తీసుకుంటాడట. పాటల ప్రపంచంలో ఇది చాలా ఎక్కువే. సిద్ధ్ శ్రీరామ్ పాడితే ఆ పాట ఎంతగా హిట్ అవుతుందో నిర్మాతలకు కూడా తెలుసు. అందుకే పాటకు 7 లక్షలైనా సరే ఇవ్వడానికి వెనుకాడరు. 


Also read: Vijay Antony: ముగ్గురు ముద్దుగుమ్మలతో విజయ్ ఆంటోనీ కొత్త సినిమా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook