రాజమౌళికి సానుభూతి ఉండదు.. ఆరోగ్యం బాగాలేకపోయినా నాతో షూటింగ్ చేపించారు! స్టార్ హీరో ఫిర్యాదు!!
Jr NTR and Ram Charan complained about SS Rajamouli. ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళి.. హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంటర్వ్యూలు ఇస్తూ పోతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరోలు మాట్లాడుతూ సెట్స్‌లో జక్కన్నకు సానుభూతి ఉండదని ఫిర్యాదు చేశారు.
Jr NTR and Ram Charan complained about SS Rajamouli: దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఎన్నో సార్లు వాయిదా పడిన ఆర్ఆర్ఆర్.. ఎట్టకేలకు మరో ఐదు రోజుల్లో (మార్చి 25) విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామని ఫాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలు వేగవంతం చేసింది. ఈ క్రమంలో డైరెక్టర్ రాజమౌళి.. హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంటర్వ్యూలు ఇస్తూ పోతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరోలు మాట్లాడుతూ సెట్స్‌లో జక్కన్నకు సానుభూతి ఉండదని ఫిర్యాదు చేశారు. 'సెట్స్‌లో ఉన్నప్పుడు రాజమౌళి ఎవరిమీద ఎలాంటి సానుభూతి, దయ, కరుణ చూపించరు. చరణ్‌కి గానీ, నాకు గానీ చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నా.. మమ్మల్ని వదిలేవారు కాదు. షూట్‌లో పాల్గొనమని చెప్పి టాస్క్ పూర్తి చేసేవారు' అని ఎన్టీఆర్ నవ్వుతూ అన్నారు.
సెట్స్‌లో రాజమౌళి ప్రవర్తన చూసి చిరాకు పడ్డ సందర్భం ఉందని రామ్ చరణ్ సరదాగా పేర్కొన్నారు. 'ఓ రోజు నాకు ఆరోగ్యం బాగోలేదు. షూటింగ్ చేద్దామా అని జక్కన్న అడిగితే.. విషయం చెప్పా. షూటింగ్ చేయడానికి సెట్స్‌పై వెయ్యి మంది ఉన్నారు, ఇప్పుడు నువ్ రాకపోతే డబ్బు అంతా వృధా అవుతుందన్నారు. ఇక చేసేదిలేక వెళ్లి షూట్‌లో పాల్గొన్నా' అని చరణ్ గుర్తు చేసుకున్నారు. ఆపై రాజమౌళి మాట్లాడుతూ.. 'నేను సానుభూతి చూపించి ఒక రోజు షూటింగ్ ఆపేస్తే.. అది ప్రొడక్షన్ హౌస్‌కు భారీ నష్టం కలిగిస్తుంది' అని సమాధానం ఇచ్చారు.
మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవుతుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. ఇక సినిమా రన్ టైమ్ 3 గంటల 6 నిమిషాల 54 సెకంన్లుగా ఉంది. కొమురం భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటించారు. అలియా భట్, శ్రీయ సరన్, అజయ్ దేవగన్, ఓలియా మోరిస్ లాంటి స్టార్లు సినిమాలో నటించారు.
Also Read: Kraigg Brathwaite: 710 నిమిషాలు, 489 బంతులు.. మారథాన్ ఇన్నింగ్స్ అంటే ఇదే కదా! లారా తర్వాత ఇతడే!!
Also Read: TTD Arjitha Seva: ఆన్లైన్లో శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు- చివరి తేదీ ఎప్పుడంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook