TTD Arjitha Seva: ఆన్​లైన్​లో శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు- చివరి తేదీ ఎప్పుడంటే..

TTD Arjitha Seva: తిరమలలో శ్రీవారి ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించాలని టీటీడీ ఇటీవల నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇందుకు సంబంధించి ఆన్​లైన్​లో టికెట్లను అందుబాటులో ఉంచింది. టికెట్లను ఎలా బుక్​ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 20, 2022, 12:48 PM IST
  • తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు టికెట్లు విడుదల
  • ఎలక్ట్రానికిక్ డిప్​ ద్వారా ఎంపిక విధానం
  • ఏప్రిల్​ 1 నుంచి ఆర్జిత సేవలు ప్రారంభం
TTD Arjitha Seva: ఆన్​లైన్​లో శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు- చివరి తేదీ ఎప్పుడంటే..

TTD Arjitha Seva: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు శుభవార్త. ఆర్జిత సేవలకోసం నేటి నుంచి టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఉదయం 10 గంటల నుంచి ఆన్​లైన్​లో అందుబాటులో ఉంచింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). ఈ నెల 22వ తేదీ వరకు ఆర్జిత సేవలకోసం టికెట్లను ఆన్​లైన్​లో బుక్​ చేసుకునే వీలుందని వెల్లడించింది.

కరోనా కారణంగా దాదాపు రెండేళ్లపాటు నిలిపివేసిన ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించాలని ఇటీవలే టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఏప్రిల్​ 1 నుంచి ఆర్జిత సేవలు అందుబాటులో ఉంటాయని వివరించింది. నేటి నుంచి 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు.. ఏప్రిల్, మే, జున్​ నెలలకు సంబంధించి టికెట్లు బుక్ చేసుకోవచ్చని పేర్కొంది టీటీడీ.

టికెట్లు బుక్​ చేసుకోవడం ఎలా?

టీటీడీ అధికారిక వెబ్​సైట్​ tirupatibalaji.ap.gov.in ద్వారా టికెట్లు బుక్​ చేసుకోవచ్చు. టికెట్లు బుకింగ్స్ వివరాలను ఈ నెల 22 తర్వాత.. సంబంధిత భక్తులకు ఎస్​ఎంఎస్​ లేదా ఈ-మెయిల్​ ద్వారా తెలియజేస్తారు. కొవిడ్ నిబంధనల కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులకు మాత్రమే టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఇందుకోసం ఎలక్ట్రానికి డిప్​ ద్వారా ఎంపిక ఎంపిక చేస్తారు.

ఈ నిబంధనలు తప్పనిసరి..

దేశవ్యాప్తంగా ప్రస్తుతం కొవిడ్ కేసులు తగ్గుతున్నప్పటికీ.. కరోనా నిబంధననల్లో మాత్రం సడలింపు లేదని టీటీడీ స్పష్టం చేసింది. తిరుమలకు వచ్చే భక్తులకు నెగెటివ్​ రిపోర్ట్​ లేదా రెండు డోసులు టీకా తీసుకున్నట్లు సర్టిఫికెట్ చూయించడం తప్పనిసరి అని టీటీడీ వివరించింది. ఇక భక్తులంతా భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటివి తప్పనిసరి అని వెల్లడించింది.

Also read: AP Inter Revised Schedule: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలకు కొత్త షెడ్యూల్ ప్రకటించిన ప్రభుత్వం

Also read: Pegasus Spyware: చిక్కుల్లో చంద్రబాబు.. మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు.. పెగాసస్ కొనుగోలు చేశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News