SS Rajamouli reveals the reason for naming his Movie RRR: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. 'బాహుబలి' సినిమా తర్వాత ప్రతిష్టాత్మంగా తెరకెక్కించిన ఈ సినిమాను దాదాపు రెండేళ్లుగా జక్కన చెక్కుతున్నారు. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు వీరులను కలిపి చూపించనున్నారు. ఆర్ఆర్ఆర్.. టాలీవుడ్ సినిమా కీర్తిని ప్రపంచవ్యాప్తంగా మరింత పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. యావత్‌ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' విడుదలకు సమయం దగ్గర పడుతోంది. జనవరి 7న విడుదలకు సిద్ధంగా ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినిమా విడుదలకు మరో వారం రోజులు మాత్రమే ఉండడంతో ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ప్రమోషన్స్‌ కార్యక్రమాలను మరింత వేగవంతం వేస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళి కలిసి వరుసగా టాక్ షో, ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా  'ది కపిల్ శర్మ షో'లో చిత్ర యూనిట్ పాల్గొంది. ఈ షోలో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళితో పాటు అలియా భట్‌ ప్రత్యేక అతిథిగా వచ్చారు. అలియా రాకతో షో మొత్తం సందడిగా మారింది. ఇక షో హోస్ట్ కపిల్ శర్మ (Kapil Sharma) అడిగిన పలు ప్రశ్నలకు ఆర్ఆర్ఆర్ నటులు, దర్శకుడు సమాధానాలు చెప్పారు. 


Also Read: Jasprit Bumrah: టెస్టుల్లో సరికొత్త రికార్డు సృష్టించిన బుమ్రా.. తొలి భారత బౌలర్‌గా!!


సినిమాకు 'RRR' అని టైటిల్‌ పెట్టడానికి గల కారణాన్ని చెప్పాలని డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళిని కపిల్ శర్మ అడిగారు. 'ఈ సినిమాకు ముందుగా ఏం టైటిల్‌ పెట్టాలో అర్ధం కాలేదు. రామ్ చరణ్, రామారావు (జూనియర్ ఎన్టీఆర్) మరియు రాజమౌళి పేర్లు కలిసేలా ఈ ప్రాజెక్ట్‌ని 'RRR' అని పిలవాలనుకున్నాం. RRR అనే హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్ అయింది. అభిమానుల నుంచి మంచి స్పందన కూడా వచ్చింది. దాంతో 'RRR' అనే టైటిల్‌ను అలాగే ఉంచాము' అని రాజమౌళి చెప్పారు. ఆపై ఆర్ఆర్ఆర్ టైటిల్ రౌద్రం, రణం, రుధిరంగా మారిపోయింది. RRR మళ్లీ వాయిదా పడుతుందనే ఊహాగానాలపై రాజమౌళి స్పందిస్తూ.. అలాంటిది ఏమీ లేదని స్పష్టం చేశారు. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ కూడా సినిమా వాయిదా పడదని ట్వీట్ చేశారు. 


Also Read: Goat with Human Face: మనిషిని పోలిన జంతువుకు జన్మనిచ్చిన మేక.. చూసేందుకు ఎగబడ్డ జనం!!
 
ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ (NTR) గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. రామ్ చరణ్ (Ram Charan) మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఈ పాత్రల కోసం ఇద్దరు హీరోలు చాలా కసరత్తు చేశారు. సీత పాత్రలో బాలీవుడ్ అందాల భామ అలియా భట్ (Alia Bhatt) నటిస్తుండగా.. బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురుతిరిగే పోరాట యోధుడిగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కనిపించనున్నారు. బ్రిటీష్ యువరాణిగా ఒలీవియా మోరిస్ కనిపిస్తుండగా.. బ్రిటీష్ అధికారి పాత్రలో మరో హాలీవుడ్ నటుడు రాయ్ స్టవ్ సన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో సముద్రఖని, శ్రియ కూడా ప్రత్యేక పాత్రలు చేశారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి