SS Rajamouli: ఇంకో `ఆర్ఆర్ఆర్` సినిమా కూడా ఉంది.. అంతకుమించి కామెడీ ఉంటుంది: రాజమౌళి
SS Rajamouli says Another RRR movie also there. ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజమౌళి మాట్లాడుతూ.. తనకు ఫ్యామిలీ మెంబర్స్ కంటే అసిస్టెంట్ డైరెక్టర్‌లే ఎక్కువ అని స్పష్టం చేశారు.
SS Rajamouli says Another RRR movie also There: దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ కోసం మెగా, నందమూరి అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఇప్పటికే ముంబైలో ప్రిరిలీజ్ ఈవెంట్ జరుపుకున్న ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్.. శుక్రవారం దుబాయ్‌లో పూర్తిచేసింది. ఇక శనివారం కర్ణాటకలోని చిక్బల్లాపూర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.
శనివారం కర్ణాటకలోని చిక్‌బళ్లాపుర్ వేదికగా ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి మాట్లాడారు. కన్నడలో సినిమాను రిలీజ్ చేస్తున్న నిర్మాత వెంకట్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎరేంజ్ చేసినందుకు ధన్యవాదాలు చెప్పారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసిన ఈ వేదిక 'మైత్రీ సంగమం' లాంటిదని అభివర్ణించాడు. మెగా అభిమానులను బంగాళాఖాతంతో, నందమూరి అభిమానులను అరేబియా మహాసముద్రంతో జక్కన్న పోల్చారు. దాంతో అక్కడి ఫాన్స్ ఒక్కసారిగా కేకలు వేశారు. ఈలలు వేస్తూ, కేకలు పెడుతూ తమ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జక్కన్న మాట్లాడుతూ.. తనకు ఫ్యామిలీ మెంబర్స్ కంటే అసిస్టెంట్ డైరెక్టర్‌లే ఎక్కువ అని స్పష్టం చేశారు. 'వాళ్లు లేకుంటే నేను ఈ చిత్రం ఇంత బాగా చేసేవాడిని కాదు. అసిస్టెంట్ డైరెక్టర్‌లు అందరికి పేరుపేరునా కృతజ్ఞతలు. త్వరలోనే మరో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఉంటుంది. అయితే అందులో హీరోల కంటే ముందే అసిస్టెంట్ డైరెక్టర్లు నటించి చూపిస్తారు. ఈ ఆర్ఆర్ఆర్ విడుదలయ్యాక ఆ సినిమా విడుదల చేస్తాం. అసిస్టెంట్ డైరెక్టర్లు నటించిన 'ఆర్ఆర్ఆర్'కు మించిన కామెడీ సినిమా ఉండదు' అని రాజమౌళి చెప్పారు.
[[{"fid":"225045","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
సుమారు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాను డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతుంది. ఆర్ఆర్ఆర్ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. సినిమా రన్ టైమ్ 3 గంటల 6 నిమిషాల 54 సెకండ్లుగా ఉంది. 1920లో బ్రిటీష్ బ్యాక్‌డ్రాప్‌తో సాగే పీరియాడిక్ మూవీ ఇది. ఇందులో కొమురం భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటించారు.
Also Read: Kraigg Brathwaite: 710 నిమిషాలు, 489 బంతులు.. మారథాన్ ఇన్నింగ్స్ అంటే ఇదే కదా! లారా తర్వాత ఇతడే!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook