SS Thaman on Bheemla Nayak: పవన్ కల్యాణ్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ భీమ్లా నాయక్: తమన్
SS Thaman on Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లో `భీమ్లా నాయక్` ఉత్తమ చిత్రంగా నిలుస్తుందని సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ జోస్యం చెప్పారు. దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి చూసిన రషెస్ లో సినిమా బాగా వచ్చిందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
SS Thaman on Bheemla Nayak: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' మూవీ గురించి సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా అవుట్ పుట్ చూసి తమ చిత్రబృందం సంతృప్తిగా ఉందని ఆయన అన్నారు. అదే విధంగా పవన్ కల్యాణ్ కెరీర్ లోనే 'భీమ్లా నాయక్' ఉత్తమ చిత్రంగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
"డైరెక్టర్ త్రివిక్రమ్ తో పాటు నేను కూడా 'భీమ్లా నాయక్' మూవీ కొన్ని సన్నివేశాలను చూశాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మూవీ పవన్ కల్యాణ్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా నిలిచిపోతుంది. నా నుంచి సినిమాకు కావాల్సిన ఉత్తమ మ్యూజిక్ అందిస్తానని ఫ్యాన్స్ కు హామీ ఇస్తున్నా" అని ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఎస్ఎస్ తమన్ చెప్పారు.
మలయాళంలో సూపర్ హిట్ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియుమ్'కు తెలుగు రీమేక్ రూపొందుతోన్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్నారు. ఇందులో పవన్ పోలీస్ ఆఫీసర్ గా.. రానా మరో ప్రధానపాత్రలో నటిస్తున్నారు. నిత్యా మేనన్, సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటించారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్.. స్క్రీన్‌ప్లే-మాటలు అందించగా, సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు.
ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుంటోంది. సంక్రాంతి రావాల్సిన 'భీమ్లా నాయక్' పలు కారణాలతో ఫిబ్రవరి 25కు వాయిదా పడింది. అయితే ప్రస్తుతం కరోనా మూడో వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సిఉంది.
Also Read: Samantha Item Song: మరో పాన్ఇండియా మూవీలో ఐటెం సాంగ్ కు 'ఊ' కొట్టిన సమంత!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook