Mahesh Babu SSMB 29: ప్రస్తుతం సినిమాలు శుక్రవారం విడుదలయితే.. ఆ తరువాత వారం.. శుక్రవారం వచ్చేసరికి.. ఆడడం కష్టం అయిపోతుంది. అయితే ఒకప్పుడు.. సినిమాలు వరుస పెట్టి సంవత్సరాలు తరబడి ఆడేవి. రెండు సంవత్సరాలు, ఒక సంవత్సరం, 500 రోజులు, 100 రోజులు.. ఇలా ఒక సినిమా సక్సెస్ అనేది.. ఎన్ని రోజులు ఆడింది అన్నదానిమీద.. ఆధారపడి ఉండేది. అయితే కాలానుగుణంగా వచ్చిన ఎన్నో మార్పుల కారణంతో.. ప్రస్తుతం సినిమాలు ఓ వారం, పది రోజులు ఆడితేనే బ్లాక్ బస్టర్ హిట్ల కింద చూస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెల్ ఫోన్లు, ఓటిటి స్ట్రీమింగ్.. వచ్చిన తర్వాత సినిమాలు కూడా ఎక్కువ థియేటర్లలో ఆడడం లేదు. థియేటర్లో విడుదలైన..మొదటి రెండు వారాలలోని.. పెట్టిన పెట్టుబడి తిరిగి తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఎక్కువ రోజులు ఆడకపోయినా ప్రొడ్యూసర్లకు.. వచ్చిన నష్టం లేదు. ఇటువంటి టైంలో ఏదైనా ఒక్క మూవీ శత దినోత్సవం లేక అర్థశత దినోత్సవం జరుపుకుంది.. అంటే అది నిజంగా ఓ పెద్ద విశేషం అనే చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి పరిస్థితిల్లో.. మహేష్ బాబు నటించిన ఓ ఏవరేజ్ చిత్రం 200 రోజులు ఆడింది అంటే ఆశ్చర్యమే కదా.


గుంటూరు జిల్లాకు చెందిన చిలకలూరిపేటలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మూవీ 200 రోజులపాటు థియేటర్లో ప్రదర్శించబడింది. కానీ అది సూపర్ డూపర్ హిట్ సినిమా అయితే కాదు. రీసెంట్ గా మహేష్ బాబు నటించిన గుంటూరు కారం.. మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ సాధించలేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ కాంబోలో వచ్చిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య థియేటర్లో విడుదలైనప్పటికీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.


మహేష్ బాబు ఇమేజ్ వర్క్ అవుట్ అవ్వడం వల్ల.. అతి కష్టం మీద ఈ మూవీ బ్రేక్ ఈవెన్ తో బయటపడింది. అటువంటి సినిమా చిలకలూరిపేటలోని.. వెంకటేశ్వర థియేటర్ లో రోజుకు నాలుగు ఆటలతో మొత్తం 200 రోజులు ఆడింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


ఇక గుంటూరు కారం ధాటికి.. త్రివిక్రమ్ ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు. త్వరలో అతను అల్లు అర్జున్ తో మూవీ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఈ మూవీతో ..సక్సెస్ సాధించి తన ఇమేజ్ కాపాడుకోవడానికి త్రివిక్రమ్ తెగ తాపత్రయపడుతున్నాడు.


Also Read: Mukesh Ambani House Pics: మైండ్ బ్లాక్‌ అయ్యేలా ముఖేష్ అంబానీ ఇల్లు.. ఆ ఫ్లోర్‌లోనే ఎందుకు ఉంటున్నారో తెలుసా..!  


Also Read: Telangana Electricity: వర్షాకాలంలో కరెంట్ సమస్యలా..వెంటనే ఇలా ఫిర్యాదు చేయండి..!!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.