SSMB28 Shooting: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ రూపొందనుంది. ఈ సినిమా పట్టాలెక్కించనున్నట్లు గతేడాది ప్రకటించినా.. కరోనా కారణంగా చిత్రీకరణను ప్రారంభించేందుకు కొంత ఆలస్యం అయ్యింది. అయితే ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. #SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా షూటింగ్ షురూ కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూడో సినిమా కాబట్టి ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. హారికా, హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ గురువారం (ఫిబ్రవరి 3) నుంచి ప్రారంభమైంది. 



పూజా కార్యక్రమాలతో SSMB28 సినిమా షూటింగ్ గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు షాట్ ను సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ కార్యక్రమంలో హీరో మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్, పూజా హెగ్డే, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు సూర్యదేవర రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీతో పాటు తదితరులు పాల్గొన్నారు. 



త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందనున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ రచన, దర్శకత్వం వహించనున్నారు. ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. మరోవైపు మహేష్ బాబు హీరోగా నటించిన 'సర్కారు వారి పాట' ఈ ఏడాది వేసవిలో విడుదల కానుంది. 



దాదాపుగా 11 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందనున్న మూడో చిత్రమిది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే అతడు (2005), ఖలేజా (2010) సినిమాలు ప్రేక్షకులను అలరించాయి.  


Also Read: Ariana Waist Kiss: అరియానా నడుముపై ముద్దు పెట్టిన జూనియర్ సమంత.. ఇదేం పనంటూ ఓ రేంజ్ లో ఆడుకుంటున్న నెటిజన్లు


ALso Read: Ketika Sharma Photos: గ్లామర్ డోస్ పెంచేసిన 'రొమాంటిక్' బ్యూటీ కేతికా శర్మ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook