Stree 2 Box Office Collections: శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా 2018లో అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్త్రీ’ మూవీ బాలీవుడ్ బాక్సాపీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ‘స్త్రీ2’ మూవీ ఈ యేడాది ఆగష్టు 15న విడుదలై సంచలన విజయం సాధించింది. తొలి రోజు నుంచే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామీ సృష్టించింది. తొలి రోజు ఈ సినిమా రూ. 55.40 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ముందు రోజు ప్రీమియర్స్ ద్వారా 9.40 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. మొత్తంగా తొలి రోజు ఈ సినిమా 64.80 కోట్ల నెట్ వసూళ్లతో బాలీవుడ్ లో సంచలనం రేపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అటు ఓవర్సీస్ ఇతరాత్రా అన్ని కలిపి ఈ సినిమా ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా రూ. 92 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి లేడీ ఓరియెంటెట్ మూవీస్ లో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. అంతేకాదు మన దేశంలో హిందీ వెర్షన్ లో ఇప్పటి వరకు రూ. 585 కోట్ల నెట్ వసూళ్లతో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈ సినిమా కంటే ముందు జవాన్, గదర్ 2, పఠాన్, బాహుబలి 2 సినిమాలున్నాయి. బాహుబలి సినిమా బాలీవుడ్ లో అత్యధిక నెట్ వసూల్లు సాధించిన సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా రికార్డును దాదాపు ఆరేళ్ల తర్వాత షారుఖ్ ‘పఠాన్’ మూవీ క్రాస్ చేసింది. అటు పఠాన్ రికార్డును సన్ని దేవోల్ ‘గదర్ 2’ క్రాస్ చేసింది. ఆ రికార్డును ‘జవాన్’ బ్రేక్ చేసింది.


తాజాగా ఈ  నాలుగు బ్లాక్ బస్టర్ సినిమాల రికార్డులను శ్రద్ధా కపూర్ ‘స్త్రీ 2’ బ్రేక్ చేసింది. అంతేకాదు ఇప్పటికే రూ. 585 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా త్వరలో రూ. 600 కోట్ల నెట్ వసూళ్ల దిశగా ప్రయాణం చేస్తుంది. మన దేశంలో హిందీ వెర్షన్ లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పట్లో ‘స్త్రీ 2’ రికార్డును బ్రేక్ చేయడం బడా హీరోలకు కూడా సాధ్యం కాదు. ప్రభాస్  సినిమాలకు వరల్డ్ వైడ్ గా వివిధ భాషల్లో కలిపి రూ. 1100 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. హిందీ వెర్షన్ మన దేశం వరకు రూ. 300 కోట్ల నెట్ వసూళ్లనే సాధించింది. మొత్తంగా హిందీలో మాస్ బెల్ట్ ఏరియాల్లో ‘స్త్రీ 2’ బాక్సాఫీస్ ను శాసించింది. మొత్తంగా సినిమా నచ్చితే బాలీవుడ్ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారని మరోసారి ‘స్త్రీ 2’ మూవీతో ప్రూవ్ అయింది. ఒక లేడీ ఓరియంటెడ్ హార్రర్ చిత్రానికి ఈ రేంజ్ వసూళ్లు రావడం చూసి ట్రేడ్ పండితులు సైతం ముక్కున వేలుసుకున్నారు.


ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..


ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.