Devara - Game Changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా విడుదలైన.. ఆర్ ఆర్ ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఈ ఇద్దరు హీరోలకి ప్యాన్ ఇండియా రేంజ్ స్టార్ డం తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలోనే అభిమానులు అందరూ.. వారి నెక్స్ట్ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకవైపు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో.. బిజీగా ఉండగా, మరొకవైపు ఎన్టీఆర్ దేవర.. సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే ఈ రెండు సినిమాల మధ్య.. బోలెడు పోలికలు ఉన్నాయి అంటూ.. అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.


మొదటగా ఈ రెండు ప్యాన్ ఇండియా సినిమాలే. రెండు సినిమాల మీద అభిమానులకి.. భారీ అంచనాలు ఉన్నాయి. దేవర సినిమాకి దర్శకత్వం వహిస్తున్న కొరటాల శివ.. ముందు సినిమా ఆచార్య డిజాస్టర్ అయింది. ఇక గేమ్ చేంజర్ సినిమాకి.. దర్శకత్వం వహిస్తున్న.. శంకర్ ముందు సినిమా భారతీయుడు 2 కూడా.. ఈ మధ్యనే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలబడింది. 


ఇలాంటి చిన్న చిన్న కామన్ పాయింట్లు పక్కన పెడితే, ఈ రెండు సినిమాల కథలు.. ఒకేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రెండు సినిమాలు కొడుకులు తమ తండ్రి కలలను నెరవేర్చడం.. మీదే ఆధారపడి ఉంటాయని తెలుస్తోంది. గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు. ఎన్టీఆర్ కూడా దేవర సినిమాలో అలాగే కనిపించనున్నారు. కొడుకు ఎంతగానో ప్రేమించిన తన తండ్రిని కొందరు చంపేస్తారు…తన తండ్రి చావుకి పగ తీర్చుకోవడమే ఈ రెండు సినిమా కథలకి మధ్య ఉన్న కామన్ పాయింట్ అని సమాచారం. 


రెండు సినిమాలలోనూ యాక్షన్ ఎక్కువగానే ఉండబోతోంది. మరోవైపు రాజమౌళితో సినిమా చేసిన ప్రతి హీరో తన నెక్స్ట్ సినిమాతో డిజాస్టర్ అందుకుంటాడని.. ఒక సెంటిమెంట్ కూడా ఉంది. ఈ ఇద్దరు హీరోల విషయంలోనూ ఈ సెంటిమెంట్ వర్తిస్తుంది. ఇప్పటికే రాజమౌళి తో పని చేశాక ఎన్టీఆర్ ఆంధ్రావాలా.. చెర్రీ ఆరంజ్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈసారి కూడా అది నిజం అవుతుందో లేదో మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. 


ఒకవైపు దేవరాజు సినిమా సెప్టెంబర్ 27న విడుదల కి సిద్ధం అవుతూ ఉండగా రామ్ చరణ్.. ఈ మధ్యనే ఇంకేం సినిమా షూటింగ్ సినిమాలో భాగంగా షూటింగ్ నీ పూర్తి చేశారు ప్రకటన


Also read: TG DSC and Groups issue: సచివాలయం దగ్గర హైటెన్షన్... నిరసనకారులను అరెస్టు చేస్తున్న పోలీసులు.. వీడియో ఇదే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook