Allu Arjun Visits Puneeth Rajkumar Family in Bengaluru: కన్నడ 'పవర్‌ స్టార్‌' పునీత్ రాజ్ కుమార్ గతేడాది అక్టోబర్ 29న గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. పునీత్ ఆకస్మిక మరణం యావత్‌ భారత సినీ పరిశ్రమను కలచివేసింది. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ సినీ ప్రముఖులు బెంగళూరు వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్‌, మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌, రెబల్ స్టార్ ప్రభాస్ లాంటి స్టార్లు పునీత్‌ ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు. తాజాగా పునీత్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ బెంగళూరుకు వెళ్లారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురువారం (ఫిబ్రవరి 3) ఉదయం హైదరాబాద్ నుంచి  బెంగళూరుకు చేరుకున్న అల్లు అర్జున్‌.. ముందుగా పునీత్‌ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్‌తో బ‌న్నీ చాలా సమయం మాట్లాడారు. పవర్‌ స్టార్‌ మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం పునీత్‌ సమాధిని సందర్శించిన ఐకాన్ స్టార్.. పుష్ప గుచ్చాలతో నివాళులు అర్పించారు. బన్నీ రాకతో శివరాజ్ ​కుమార్​ ఇంటి ముందు​ భారీ సంఖ్యలో ఫ్యాన్స్ గూమిగూడారు.


'పుష్ప' సినిమా ప్రమోషన్స్ కోసం చాలా రోజుల పాటు బెంగళూరులోనే ఉన్న అల్లు అర్జున్‌.. పునీత్‌ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను కలిసేందుకు వెళ్లలేదు. పునీత్ మరణం తనకు తీవ్రంగా కలచివేసిందని, సినిమా ప్రమోషన్‌కు వచ్చి పునీత్‌ కుటుంబ సభ్యులను పరామర్శించడం సమంజసం కాదని అప్పుడు బన్నీ అన్నారు. ఇప్పుడు సమయం దొరకడంతో బెంగళూరుకు వెళ్లి పునీత్‌కు నివాళి అర్పించారు. 



గ‌తేడాది అక్టోబ‌ర్ 29 ఉద‌యం జిమ్ చేస్తున్న స‌మ‌యంలో కన్నడ 'పవర్‌ స్టార్‌' పునీత్ రాజ్‌కుమార్‌కు గుండె పోటు వ‌చ్చింది. రూమ్‌లోనే ఆయన కొండపడిపోయారు. పునీత్‌ను వెంట‌నే బెంగుళూరులోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ప‌రిస్థితి అప్పటికే చేయి దాటిపోయింది. ఆస్పత్రికే వెళ్లిన కొద్ది సేపటికే ఆయన కన్నుమూశారు. 


Also Read: ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఒవైసీపై హత్యాయత్నం.. తుపాకులతో దుండగుల కాల్పులు!!


Also Red:  AP Corona cases: ఏపీలో కొత్తగా 4,348 మందికి కొవిడ్​ పాజిటివ్​- 18 వేలపైకి యాక్టివ్​ కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook