Gun Attack on AIMIM Chief Asaduddin Owaisi: ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై హత్యాయత్నం జరిగింది. ఒవైసీ కారుపై గుర్తుతెలియని కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరట్ జిల్లా కిథౌర్‌లో ఇద్దరు వ్యక్తులు ఒవైసీపై కారుపై కాల్పులకు పాల్పడ్డారు. దుండగులు మూడు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. 3-4 తూటాలు కారు కింది భాగంలోకి దూసుకెళ్లాయి. మీరట్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీ వెళుతుండగా ఈ ఘటన జరిగింది.
'ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం మీరట్‌లోని కిథౌర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీకి బయలుదేరాను. ఛజర్సీ టోల్ ప్లాజా సమీపంలో నా వాహనంపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. 3-4 రౌండ్ల బూల్లెట్స్ దూసుకెళ్లాయి. దాంతో నా వాహనం టైర్లు పంక్చర్ అయ్యాయి. దాడి చేసేందుకు వచ్చిన వారు మొత్తం ముగ్గురు-నలుగురు ఉన్నారు. నేను వేరే వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయాను' అని ఏఎన్ఐ వార్తా సంస్థతో అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.
ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై హత్యాయత్నం చేసేందుకు నలుగురు దుండగులు ఛజర్సీ టోల్ ప్లాజా సమీపంకు వచ్చినట్టు సమాచారం తెలుస్తోంది. కాల్పుల తర్వాత తుపాకులు ఘటనా స్థలంలోనే వదిలి దుండుగులు పారిపోయారని సమాచారం. ఈ ఘటనలో ఎవ్వరికీ ఏమీ కాలేదు. కారుకు బుల్లెట్లు తగిలిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.
Also Read: IPL 2022: భారత్‌లోనే ఐపీఎల్ 2022.. స్పష్టం చేసిన సౌరవ్ గంగూలీ! కానీ..!!
Also Read: పుట్టు మచ్చలెన్ని ఉన్నాయంటూ ప్రశ్నించిన జర్నలిస్టు.. మండిపడిన 'డీజే టిల్లు' హీరోయిన్?
I was leaving for Delhi after a poll event in Kithaur, Meerut (UP). 3-4 rounds of bullets were fired upon my vehicle by 2 people near Chhajarsi toll plaza; they were a total of 3-4 people. Tyres of my vehicle (in pic) punctured, I left on another vehicle: Asaduddin Owaisi to ANI pic.twitter.com/ksV6OWb57h
— ANI (@ANI) February 3, 2022